స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ ఓడి పోవడానికి ప్రధాన కారణం వర్గ విభేదాలు అనే వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ముందునుంచి వినబడుతున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో చాలామంది నేతలు సమర్థవంతంగా పని చేయలేదు. ఈ నేపథ్యంలోనే గుంటూరు జిల్లాకు చెందిన ఒక ఎంపీ ఎమ్మెల్యే విషయంలో ముఖ్యమంత్రి జగన్ చాలా సీరియస్ గా ఉన్నారు. ముందు నుంచి వీళ్ళిద్దరూ వర్గ విభేదాలు పెట్టుకొని పార్టీని పక్కనపెట్టారు.
దీని కారణంగా కార్యకర్తలలో కూడా విశ్వాసం దెబ్బతిన్నది. అంతే కాకుండా మరో ఎంపీ మరో ఎమ్మెల్యే కూడా విభేదాలు పెట్టుకొని పార్టీకి ప్రజలను అలాగే కార్యకర్తలను దూరం చేశారు. దీని వలన చాలా మంది దళిత సామాజిక వర్గం నేతలు కూడా పార్టీకి దూరం జరిగారు అనే భావన రాజకీయ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. చీరాల నియోజకవర్గంలో కూడా పరిస్థితులు రోజురోజుకి దిగజారుతున్నాయి అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
అందుకే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇప్పుడు వీళ్ళ విభేదాలు మీద దృష్టి పెట్టినట్టు సమాచారం. త్వరలోనే జగన్ క్లాస్ పీకి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. ప్రభుత్వ ప్రధాన సలహాదారు, వైసిపి అగ్రనేత సజ్జల రామకృష్ణారెడ్డి వీళ్లతో చర్చలు జరిపినా సరే పెద్దగా ప్రయోజనం కనపడలేదు. అందుకే ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్ నేరుగా రంగంలోకి దిగే అవకాశాలున్నాయి. వీళ్ళ నియోజకవర్గంలో సొంత గ్రామాల్లో కూడా వైసిపి ఓడిపోవడంతో జగన్ కాస్త సీరియస్ గానే అడుగులు వేసే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి.