ధనం మూలం ఇదం జగత్.. ఈ రోజుల్లో పైసానే అన్నీ.. మరి ధనానికి మూలం లక్ష్మి దేవి. ఆమె అనుగ్రహం ఉంటేనే అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి. శాస్త్ర ప్రకారం కొన్నిటిని నమ్మాలి.. అంతేకాదు కొన్నిటిని అనుసరించాలి.. ముఖ్యంగా డబ్బుల విషయం ఎక్కువ.. లక్ష్మి దేవి అనుగ్రహం మన మీద ఉండాలంటే మాత్రం మన జేబులో ఉండే పర్సులో కొన్ని వస్తువులు అస్సలు ఉంచకూడదు.. ఆ వస్తువులు ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
అప్పుల చిట్టా లేదా ప్రామీసరీ నోటు, EMI పేపర్- మనం ఎప్పుడూ అప్పుల చిట్టా లేదా బిల్లు లేదా EMI పేపర్ వంటి వాటిని మన పర్సులో ఉంచుకోకూడదట. పర్స్‌లో ఫోన్ బిల్లు, కరెంటు బిల్లు లేదా ఇంటి ఖర్చుల జాబితా కూడా పెట్టుకోవద్దు. చెత్త రూపంలో చూస్తే అనవసరపు ఖర్చులు రాహు పెంచుతారు.
దేవతల చిత్రం- కొందరు వ్యక్తులు తమ పర్సులో దేవుళ్ళ మరియు దేవతల చిత్రాలను ఉంచుకుని, కలిసి తిరుగుతారు. అలా చేయడం అస్సలు సరికాదు. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవికి కోపం వస్తుంది. పర్సుకు బదులు ఇంట్లో, మనసులో దేవతలకు ప్రత్యేక స్థానాన్ని ఇవ్వండి.
మన పెద్దవాళ్ళు అంటే మనకు చాలా ఇష్టం ఉంటుంది.అయితే వాళ్ళ గుర్తుగా ఫోటోలను పర్సు లో పెట్టుకోవడం మంచిది కాదట.ఇంట్లో పెట్టుకోవడం మేలు..ఇంటికి నైరుతి దిశలో అమర్చుకుంటే మంచిది.
తమ పర్సులో కీని ఉంచుకుంటారు, ఇది సరైనది కాదు. కీని పర్సులో ఉంచుకోవడం వల్ల వ్యాపారంలో నష్టం వాటిల్లుతుంది. వాస్తు ప్రకారం, నాణేలు కాకుండా మరే ఇతర లోహాన్ని పర్సులో ఉంచడం వల్ల ప్రతికూల శక్తి ఏర్పడుతుంది మరియు లక్ష్మీదేవికి కోపం వస్తుంది.
చివరగా పర్సులో డబ్బులను ఎలా పడితే అలా వాడ కూడదు.చిందర వందరగా కాకుండా మంచిగా, చూడటానికి నీటిగా పెడితే లక్ష్మీ దేవి అనుగ్రహం తప్పక ఉంటుంది.