కుబేరుడు దిక్పాలకులలో ఒకడు. ఉత్తర దిక్కుకు, సమస్త సంపదలకు అధిపతి కుబేరుడు. విశ్వబ్రహ్మకు కుమారుడితడు. ఇతని తల్లి ఇలబిల. ఇతడు బ్రహ్మ గురించి తపస్సు చేసిన కుబేరుడు ధనాధిపత్యం, లంక అనే నగరం, నలకుబేరుడు, మణిగ్రీవుడు అనే ఇద్దరు కుమారులను వరంగా పొందుతాడు. ఒకసారి కుబేరుడు పుష్పక విమానంలో సంచరిస్తుండగా కుబేరుడి సవతి తల్లి కైకసి చూస్తుంది. వెంటనే రావణాసురుడిని పిలిచి ఆ విమానం తీసుకురావాలని ఆదేశిస్తుంది.
అప్పుడు రావణుడు శివుని గురించి తపస్సు చేసి ఆయనను మెప్పించి అనేక వరాలు పొందుతాడు. తర్వాత కుబేరుడి వద్ద నుంచి లంక నగరాన్ని, పుష్పక విమానాన్ని తన వర బలంతో బలవంతంగా బెదిరించి తీసుకున్నాడు. దీంతో రాజ్యాన్ని కుబేరుడు రావణాసురుడికి అప్పగించి కైలాసానికి వెళ్తాడు. ఆ విధంగా రావణాసురుడి తల్లి కోరిక తీర్చడమే కాకుండా కుబేరుడు అందంగా, అ్యతంత అద్భుతంగా నిర్మించుకున్న లంక నగరాన్ని స్వాధీనం చేసుకున్నాడు.
కుబేరుడి సవతి తల్లి కైకసి కుమారుడు రావణుడు, అంటే కుబేరుడికి స్వయాన తమ్ముడు రావణాసురుడు. అన్నని బెదిరించి రాజ్యాన్ని, పుష్పక విమానాన్ని తీసుకున్న ఘనుడు. ఇప్పుడు తెలిసిందా కుబేరుడు తమ్ముడు రావణాసురుడు అని.
– కేశవ