ఇంట్లో అరటి చెట్లు నాటితే అశుభాలు కలుగుతాయా?

-

ప్రకృతి ప్రేమికులు ఇంట్లో రకరకాల చెట్లను పెంచాలని అనుకుంటారు..అయితే కొన్ని మొక్కల జోలికి వెళ్ళక పోవడం మంచిదని నిపుణులు అంటున్నారు. అందులో ఒకటి అరటి చెట్టు..ఈ చెట్టును ఇంట్లో నాటితే ఏదైనా అశుభాలు కలుగుతాయా..ఎలాంటివి జరుగవచ్చు..వీటి గురించి పూర్తిగా తెలుసుకుందాము..

అరటి చెట్టులోని ప్రతిభాగం ఎంతో ఉపయోగకరం. వాటి ఆకులను ఆహారం వడ్డించడానికి ఉపయోగించేవారు..కానీ ఇప్పుడు ఎవరూ ఈ చెట్టు పై ఆసక్తి చూపించలేదు. కొంతమంది ఉదయాన్నే లేవగానే ఈ చెట్టును చూడడం అశుభం అనుకుంటారు. దాని కారణంగా చెట్టును పెంచరు. అయితే జ్యోతిష్యశాస్త్ర నిపుణులు ఈ అరటి మొక్కను పెరట్లో పెంచడం శుభమే అంటున్నారు. అరటి చెట్టును ఈశాన్య దిక్కులో నాటడం ఉత్తమం.

ఇలా నాటడం వలన మన ఇంట్లో సుఖసంపదలు కలుగుతాయి. అలాగే ఈ చెట్టులో నారాయణుడు కొలువై వుంటాడని నమ్మకం. తులసి చెట్టును లక్ష్మీదేవిగా భావిస్తారు. అందుకే అరటి చెట్టు కింద తులసి చెట్టును నాటాలి. అప్పుడు ఇద్దరి ఆశీస్సులు దక్కుతాయి. ప్రతి గురువారం చెట్టును పసుపు కుంకుమతో పూజించి దీపం వెలిగించాలి. అలా చేయడం వలన గృహంలో సుఖసంపదలు కలుగుతాయి. అరటి చెట్టును ఎప్పుడైన ఇంటి వెనుక భాగంలో నాటాలి. ఇంటి ముందు భాగంలో నాటకూడదు..

అది అశుభం. అరటి చెట్టును తప్పుగా నాటిన,తగిన జాగ్రత్తలు తీసుకోకపోయిన ఇంట్లో అశుభాలు జరుగుతాయి. చెట్టు చుట్టూ శుభ్రంగా వుంచాలి. ప్రతిరోజు నీళ్లను పోయాలి. ఈ చెట్టుకు బట్టలు,గిన్నెలు కడిగిన ,మిగిలిన నీటిని పోయకూడదు. అలా చేయడం అశుభం. అంతేకాదు,ఆకులు ఎండిపోతే వెంటనే తీసివేయాలి. అలాగే ఈ చెట్టుకు జ్యోతిష్యంలో మంచి స్థానం వుంది.. శుభాలు కలుగుతాయి. అయితే వాస్తు ప్రకారం నాటితే మీకు తిరుగు ఉండదు..

Read more RELATED
Recommended to you

Latest news