సోమనాథ్ ఆలయం విశేషాలు..!

127

శివుడు కి ఎంతో ప్రత్యేకమైన ద్వాదశ  జ్యోతిర్లింగాలలో సోమనాథ్ ఆలయం  మొదటిదిగా చెప్పబడుతుంది. పన్నెండు జ్యోతిర్లింగాలలో సోమనాథ్ ఆలయం మొదటిది. ప్రముఖ జ్యోతిర్లింగ క్షేత్రం గుజరాత్‌లో ఉంది . ఈ ఆలయం పై ఎన్నో సార్లు సంపద కోసం దాడులు జరిగాయి.  ధ్వంసం చేసిన ప్రతి సారి మళ్ళి తిరిగి అక్కడే పుననిర్మించారు. చివరిగా 1947 నుండి 1957 వరకు దీని నిర్మించగా అప్పటి రాష్ట్రపతి రాజేంద్రప్రసాద్ గారు ప్రారంభించారు.

ఇక్కడి విశేషం ఏమిటంటే ఈ ఆలయంలోని శివ లింగాన్ని చంద్రుడు  ప్రతిష్టించాడు అని భక్తుల నమ్మకం. . ఈ శివలింగం భూమి లోపల నుండి ఎటువంటి సపోర్ట్ లేకుండా ఉంటుంది. గాలిలో తేలినట్టు ఉండే ఈ శివ లింగం ఒక అద్భుత దృశ్యం. ఇది ఒక మ్యాజికల్ స్టోన్. ఇది బంగారాన్ని ఉత్పత్తి చేయ గలిగే శక్తి ఉంది.

దీనికి గురుత్వాకర్షణ శక్తి ఉండటం వల్ల ఏ విధమైన సపోర్ట్ లేకుండా ఉందని చెబుతారు.పురాణాల ప్రకారం ఈ ఆలయాన్ని చంద్రుడు బంగారంతో, రావణాసురుడు వెండితో, శ్రీ కృష్ణుడు గంధపు చెక్కల తో నిర్మించినట్లు తెలుస్తుంది. ఈ ఆలయానికి ప్రాణ ప్రతిష్ట 10 వ త్రేతాయుగంలో అంటే 7,99,25,105 సంవత్సరాల కిందట జరిగినట్లు పురాణ కథనం.