జగన్ సంచలన నిర్ణయం, వాళ్ళను అనుమతించండి…!

169

కరోనా వైరస్ నేపధ్యంలో తెలంగాణా ప్రభుత్వం పక్కా చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఎలా అయినా సరే వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడానికి గానూ తెలంగాణా ప్రభుత్వం కఠిన నిర్ణయాలు అమలు చేస్తుంది. హైదరాబాద్ లో ఉన్న ఆంధ్రప్రదేశ్ కి చెందిన వారు తమ నివాసాలకు వెళ్ళిపోవాలని తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. హైదరాబాద్ లో ఉన్న హాస్టల్ యజమానులు ఖాళీ చెయ్యాలని ఆదేశించిన నేపధ్యంలో అక్కడ ఉన్న వారు సొంత వాహనాల ద్వారా ఎపీకి వచ్చేస్తున్నారు.

తెలంగాణా పోలీసు శాఖ వారికి వెళ్ళడానికి అనుమతి ఇచ్చిన నేపధ్యంలో ఐటి ఉద్యోగులు, విద్యార్ధులు అందరూ కూడా హైదరాబాద్ నుంచి వచ్చేస్తున్నారు. మధ్యాహ్నం మూడు గంటల నుంచి ఏపీలోకి వెళ్లేందుకు ప్రజలు వస్తుండగా… పోలీసులు మాత్రం వారికి అనుమతి ఇవ్వడం లేదు. దీంతో జగ్గయ్యపేట ప్రాంతంలోని ఏపీ సరిహద్దుల్లో మూడు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయ్యింది. లాక్ డౌన్ ఉన్న కారణంగానే తాము ఎవరినీ అనుమతించడం లేదని ఆంధ్రప్రదేశ్ పోలీసులు చెప్తున్నారు.

దీనిపై మీడియాలో వార్తలు వచ్చిన నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ సంప్రదింపులు జరిపారు. పోలీసులు అనుమతించకపోవడంతో రోడ్డుపైనే నిలిచిపోయిన వారిని ఏపీలోకి అనుమతించాలని, జగ్గయ్యపేట వద్ద ఉన్న ఏపీ వారికి హెల్త్‌ ప్రోటోకాల్‌ పాటించి రాష్ట్రంలోకి అనుమతించాలని నిర్ణయించారు. ఇక హైదరాబాద్‌ నుంచి ఎవ్వరు వచ్చినా అనుమతించేది లేదని స్పష్టంచేశారు. దయచేసి ఎక్కడివారు అక్కడే ఉండాలని ఏపీ అధికారులు కోరుతున్నారు.