భక్తి: మంచి ఉద్యోగం కోసం ఇలా అనుసరించండి…!

-

చాలా మంది మంచి ఉద్యోగం కోసం అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. మీరు కూడా ఉద్యోగం రావాలని ప్రయత్నాలు చేస్తున్నారా…? కానీ అవి ఎంత మాత్రము ఫలించడం లేదా…? అయితే పండితులు ఇప్పుడు మీకోసం కొన్నిటిప్స్ ని చెప్పారు. మీరు కనుక వాటిని అనుసరించారు అంటే మంచి ఉద్యోగం మీకు తప్పక వస్తుంది. మరి ఇప్పుడు వాటి కోసం చూసేద్దాం..

 

శివుడునీ మరియు విఘ్నేశ్వరుడిని పూజించడం:

ప్రతి రోజు కనుక మీరు శివుడిని విఘ్నేశ్వరుడిని పూజిస్తే తప్పకుండా మీకు మంచి ఉద్యోగం వస్తుంది. సోమవారం నాడు మీరు శివుడికి పచ్చి పాలు నీళ్లు అక్షింతలు అర్పిస్తే తప్పకుండా మీకు మంచి ఫలితం వస్తుంది.

అదే విధంగా చతుర్థినాడు విఘ్నేశ్వరుడికి లవంగాలు మరియు తమలపాకులు ఇస్తే నీకు తప్పక విజయం ఉంటుంది.

హనుమంతుడిని పూజించడం:

హనుమాన్ చాలీసా చదువుకోవడం, హనుమంతుడికి గులాబి పూలని పెట్టడం వలన కూడా మంచి ఫలితాలు కనపడతాయి అని పండితులు అంటున్నారు. మీరే ఇంటర్వ్యూకి కానీ పరీక్షకైనా వెళ్తున్నప్పుడు.. పెరుగు లో కొంచెం పంచదార వేసుకుని తింటూ బయలుదేరండి.

దీని వల్ల కూడా మీకు శుభం కలుగుతుంది. ఇంటర్వ్యూ కి వెళ్లే ఉదయం మీరు స్నానం చేసే బకెట్ నీళ్లలో కొద్దిగా పసుపు వేసి స్నానం చేయండి. దీనివల్ల కూడా మీకు మంచి విజయం దక్కుతుందని పండితులు అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news