అమెజాన్ ప్రైమ్ వినియోగదారులకు ఆ సంస్థ గట్టి షాకిచ్చిందనే అనుకోవాలి. ఎందుకంటే నిన్నటి వరకు అమెజాన్ ఫ్రీ ట్రయల్, నెలవారీ ప్లాన్లలను తొలగించివేసింది. అమెజాన్ ప్రత్యేక ఓటీటీ అమెజాన్ ప్రైమ్. గతంలో అందుబాటులో ఉన్న నెలవారీ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌ను టెంపరరీగా తొలగించిందినట్లు వెల్లడించింది. అదేవిధంగా నూతన కస్టమర్లను ఆకట్టుకునేందుకు ఇచ్చిన ఫ్రీ ట్రయల్ ఆఫర్‌ను కూడా తాత్కాలికంగా నిలిపివేసింది అమెజాన్. ఇక ప్రైమ్ వినియోగదారులకు కేవలం 3 నెలల వ్యవధి నుంచి సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌లు అందుబాటులో ఉండనున్నాయి. ఆర్‌బీఐ నూతన ఆదేశాలకు తలొగ్గి ఈ నిర్ణయం తీసుకున్నట్లు అమెజాన్ తెలిపింది. ఓటీటీ డీటీహెచ్, రీచార్జిలు ఆన్‌లైన్ లావాదేవీలు జరపాలని ఏఎఫ్‌ఏ (Additional factor of authentication) ను అమలు చేయాలని బ్యాంకులకు ఇతర సంస్థలకు ఆర్‌బీఐ ఆదేశించిన విషయం తెలిసిందే.
ఈ నిబంధనలకు లోబడే ప్రైమ్ నెలవారీ ప్లాన్ రూ.129 ను తొలగించింది. అంటే ఇక అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రైబ్ చేసుకోవాలంటే రూ.329 విలువ గల మూడు నెలల ప్లాన్‌ను నుంచి రూ.999 గల సంవత్సరం ప్లాన్‌లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఇక కొత్తగా యూజర్లు ప్యాక్ తీసుకోవాలన్నా, లేదా రెనివల్ చేసుకున్నా మూడు నెలలు లేదా సంవత్సరం ప్లాన్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోవాల్సి ఉంటుంది.
ఈ మేరకు ఏప్రిల్ 27న అమెజాన్ ప్రైమ్ తన సపోర్ట్ పేజీలో మార్పులు చేశారు. కానీ, మొదట∙ఈ నిర్ణయాన్ని మార్చి 31 నుంచే అమలు చేయాలని ఆర్‌బీఐ భావించగా.. బ్యాంకులు, పేమెంట్ గేట్‌వేల వినతితో దీన్ని సెప్టెంబర్ 30 వరకు వాయిదా వేసింది.
ఒకవైపు కొవిడ్ నేపథ్యంలో థియేటర్లు మూతపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో వెబ్ సిరీస్లతో పాటు సినిమాలు కూడా ఓటీటీలో విడుదల చేస్తున్నారు. ఫలితంగా ఓటీటీలకు విపరీతమైన క్రేజ్ పెరిగింది. ఈ క్రమంలోనే అమెజాన్ ప్రైమ్ వీడియో కూడా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో తనదైన ముద్ర వేసుకుంది. అంతేకాదు, ఇతర ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లకు గట్టి పోటీనిచ్చేందుకు నెలవారీ ప్లాన్‌ను అందిస్తూ వస్తోంది. దీంతో ఏడాది పాటు సబ్‌స్క్రిప్షన్ పొందలేని వినియోగదారులకు నెలరోజుల ప్యాక్ తీసుకుని ఎంజాయ్ చేసే వారు. అయితే, ఇప్పుడు అటువంటి వారికి అమెజాన్ పెద్ద షాకిచ్చిందనే చెప్పాలి. కాగా, ప్రైమ్ ఫ్రీ ట్రయల్, నెలవారీ సబ్‌స్క్రిప్షన్‌ను తాత్కాలికంగా తొలగించిన అమెజాన్.. భవిష్యత్తులో దీన్ని పునరుద్ధరిస్తుందా?లేదా? అనే విషయంపై మాత్రం సంస్థ ఇంకా స్పష్టతను ఇవ్వలేదు.