వ‌రంగ‌ల్ జిల్లాలో గొడుగు నీడ‌లో శివ‌య్య‌కు ర‌క్ష‌ణ.. ఏం జ‌రుగుతోంది..!

-

కాకతీయుల శిల్పకళాకీర్తికి మణిమకుటంగా వర్ధిల్లుతూ మ‌న దేశంలో ఇప్పటికీ చాలా గ్రామాలున్నాయి. ఈ క్ర‌మంలోనే కాకతీయుల పూర్వ వైభవానికి చిహ్నాలుగా వరంగల్ జిల్లాలొ ఎన్నో కట్టడాలు, ప్రాకారాలు,  తటాకాలు ఇంకా మన కళ్ళెదుటే వున్నాయి. కాకతీయులనాటి గణపవరమే నేటి గణపురం. 780 ఏళ్లకు పైగా కాలపరీక్షలకు తట్టుకొని కాకతీయ రాజన్యుల రాజసానికి వారి స్వర్ణయుగ పాలనకు నిలువెత్తు సాక్ష్యంగా.. గంభీరంగా గెలిచి నిలిచిన అపూర్వ శిల్పకళా వైభవశాలగా ఉంది గణపురం. కాకతీయ కళా వైభవానికి ప్ర‌తీక‌గా నిలిచింది కోటగుళ్లు దేవాలయం.

ఉట్టిపడే శిల్పకళ, అద్భుత నిర్మాణ శైలితో ఘనపురంలో కోటగుళ్లను నిర్మించారు ఆనాడు. కానీ, ఇప్పుడా చారిత్రక సంపదకు ప్రమాదం పొంచివుంది. పాలకుల శీతకన్ను, పురావస్తు శాఖ వారి నిర్లక్ష్యంతో మహా శివుడు ఎండకు ఎండుతూ..వానకు తడుస్తూ..గొడుకు నీడన తలదాచుకుంటున్నాడు.  జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రానికి 16 కిలోమీటర్ల దూరంలో కోట‌గుళ్లు చ‌రిత్ర ఉంది.

అయితే ప్ర‌స్తుతం చినుకు పడిందంటే చాలు గర్బగుడి పూర్తిగా నీటితో నిండిపోతుంది. దీంతో ఆలయ పూజారి, భక్తుల సాయంతో దేవుడికి గొడుగును అడ్డుగా పెట్టారు. ఆలయ పరిరక్షణకు కమిటీవారు గుడిపై ప్లాస్టిక్‌ కవర్లు కప్పినా కానీ, గాలికి కవర్లు లేచిపోవడంతో మండపం మధ్యభాగం నుండి వరదనీరు నేరుగా గర్భాలయంలో పడుతుంది. ఇప్పటికే ఆలయం వెనుకవైపు ఒరిగిపోతుండటంతో స్థానికులు సైతం ఆందోళనకు గురవుతున్నారు.

అయితే  క్రీ.శ 1213లో ఈ ఆలయాలు నిర్మించారు. కాకతీయ మహా రాజు గణపతి దేవ చక్రవర్తి పాలనా సమయంలో ఈ ఆలయం జీవం పోసుకుంది. 22 ఉప గుళ్లు, రెండు ప్రధాన దేవాలయ సముదాయంతో అద్బుత నిర్మాణం చరిత్రలో నిలిచిపోయింది. అలాంటి కోట‌గుళ్ల‌లోకి ఇప్పుడు ప్ర‌మాదం  ఉన్నా ప్రభుత్వం ప‌ట్టించుకోక‌పోవ‌డం బాధాక‌రం.

Read more RELATED
Recommended to you

Latest news