వైసీపీలో కొత్త ముస‌లం మెద‌లైంది…!

-

మొన్నటివరకు టీడీపీ సీనియర్ నేతగా ఉన్న తోట త్రిమూర్తులు ఇకపై వైసీపీ నాయకుడు కానున్నారు. ఎన్నో ఏళ్లుగా టీడీపీతో అనుబంధం గల ఈ నాయకుడు పార్టీ మారడం తూర్పు గోదావరి రాజకీయాల్లో సంచలనం రేపుతోంది. 1994లో ఇండిపెండెంట్ గా గెలిచిన త్రిమూర్తులు 1999లో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఇక 2004లో టీడీపీ నుంచి ఓడిపోయి…ఆ తర్వాత చిరంజీవి ప్రజారాజ్యంలోకి వెళ్ళి 2009 లో ఓడిపోయారు. ఇక 2012 రామచంద్రాపురం ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ తరుపున ఎమ్మెల్యేగా గెలిచారు. మళ్ళీ 2014లో టీడీపీలోకి వచ్చి గెలవగా, 2019లో అదే టీడీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు.

ఓడిపోయిన దగ్గర నుంచి టీడీపీకి దూరంగా ఉంటున్న తోట త్రిమూర్తులు…తాజాగా వైసీపీలో చేరేందుకు సిద్ధమైపోయారు. ఇప్పటికే కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసి టీడీపీని వీడుతున్నట్లు ప్రకటించిన తోట….ఒకటి, రెండు రోజుల్లోనే సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరనున్నారు. నియోజక వర్గానికి చెందిన ముఖ్య నాయకులు కొంతమందితో ఆయనతో పార్టీలో చేరనున్నారు.

అయితే వైసీపీలోకి వస్తే తనకు తూర్పుగోదావరి జిల్లా అధ్యక్ష బాధ్యతలు ఇవ్వాలని తోట కండిషన్ పెట్టినట్టు తెలుస్తోంది. కానీ దీనికి ప్రస్తుత రామచంద్రాపురం వైసీపీ ఎమ్మెల్యే చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, మంత్రి కురసాల కన్నబాబు విముఖత వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం. అసలు ఈయన వల్ల పార్టీకి పెద్దగా ఉపయోగం లేదని వారు భావిస్తున్నట్లు తెలుస్తోంది. పైగా తోట ఒక ఔట్ డేటెడ్ నాయకుడని, అధికారం ఎక్కడ ఉంటే అక్కడ ఉంటారనే ప్రచారం కూడా ఉంది. అలాగే ఎన్నికల ముందు గానీ, ఓడిపోయిన తర్వాత గానీ తోట టీడీపీ అధిష్టానాన్ని ఏ విధంగా బ్లాక్ మెయిల్ చూశారో అందరూ చూశారు.

ఇవన్నీ ఒక ఎత్తు అయితే… చిరకాల రాజకీయ శత్రువు మంత్రి పిల్లి సుబాష్ చంద్రబోస్ తోట ఎంట్రీకి అసలు ఒప్పుకోవట్లేదని తెలిసింది. ఒకవేళ పార్టీలోకి వచ్చిన జిల్లా అధ్యక్ష పదవి ఇవ్వకూడదని వైసీపీ అధిష్టానానికి చెప్పినట్లు సమాచారం. మొత్తం మీద అయితే తోట ఎంట్రీ జిల్లా వైసీపీ నేతలకు ససేమిరా ఇష్టం లేదు. ఒకవేళ పార్టీలో చేర్చుకున్న జిల్లా అధ్యక్ష పదవి ఇస్తే ఊరుకునేదే లేదని చెప్పేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news