గురువు స్వక్షేత్రమైన ధనస్సురాశిలోకి ప్రవేశం చేశాడు. నవగ్రహాలలో గురు గ్రహనికి అత్యధిక ప్రాధాన్యత కలిగిన గ్రహం. పరిమాణంలో కూడా పెద్ద గ్రహం గురు గ్రహం. సమస్త శుభకార్యాలకు గురు గ్రహబలమే ప్రధాన కారణం అవుతుంది. వ్యక్తీ గత జాతకంలో కూడా గురు గ్రహ బలం చాలా ముఖ్యమైనది. విద్యకు, వివాహానికి, అభివృద్దికి అన్నింటికి గురు బలమే ప్రధానం. పన్నెండు రాశులు మేషం మొదలుకుని మీనరాశి వరకు మొత్తం రాశి చక్రం ఒకసారి తిరిగి రావడానికి గురు గ్రహానికి 12 సంవత్సరాలు పడుతుంది.అనగా ప్రతి రాశిలో ఒక సంవత్సరం పాటు ఉంటాడు. జీవితంలో అభివృద్ధి చెందడానికి గురు గ్రహం ఎంతగానో దోహదపడుతూ వ్యక్తి తెలివితేటలు జ్ఞానం, భక్తి, అభివృద్ధి, విజయం, ధనం, వృత్తి తదితరాలు గురుగ్రహ శుభ “దృష్టి” అనుగ్రహం మీద ఆధారపడి ఉంటాయి.
మనకున్న పన్నెండు రాశులలో ధనూరాశికి మరియు మీనరాశి రాశులకు గురువునకు స్వస్థానములు అవుతుంది,ఆయా రాశులకు ఆధిపత్యం వహిస్తూ ఉంటాడు.గురువు కర్కాటకంలో ఉచ్చ స్థితిని, మకరంలో నీచ స్థితిని పొందుతాడు. ఈ సంవత్సరం గురువు తన స్వంత రాశి అయిన ధనస్సురాశిలోకి 5 నవంబర్ 2019 మంగళవారం రోజు నుండి ప్రవేశిస్తున్నాడు.అక్కడ 2020 మార్చి 29 వరకు ఉంటాడు. ఆ తర్వాత పక్కనే ఉన్న మకరరాశి లోకి వెళ్లి మూడు నెలలు అక్కడ స్థిరంగా ఉండి తర్వాత వక్రీకరించి మళ్లీ 29 జూన్ 2020 ధనస్సురాశిలోకి తిరిగి వస్తాడు.19 నవంబర్ 2020 వరకు ధనస్సురాశి లోనే ఉంటాడు.అనగా ఒక సంవత్సర కాలం ధనస్సురాశి వారు గురుడు ఇచ్చే శుభఫలితాలను పొందగలరు.
సుమారు 5 నెలలు శనితో కలిసి 2 రాశులలో ఫలితాలు ఇస్తాడు.జనవరి 2020 వరకు శనితో కలిసి గురుడు ధనస్సు రాశిలో ఉంటాడు. రాహు,కేతువుల దృష్టి కూడా ఉన్నది. మాటలు వ్యవహారాలు, లావాదేవీలు, ఒడంబడిక మొదలైనవి చూడగలిగే శుక్రుడు కూడా వీరితో కలుస్తారు. అందువలన ఎప్పటి నుండో పెండింగ్ లో ఉన్న సమస్యలు ఒక రూపం దాల్చుతాయి. గురువు ద్వాదశ రాశులు,లగ్నముల వారికి గోచార ప్రభావ ఫలితాలు ఏ విధంగా ఇవ్వబోతున్నాడో తెలుసుకుందాం. గురువు ముఖ్యంగా ఆరు రాశుల/ లగ్నాల వారికి శుభ ఫలితాలను ఇస్తున్నాడు.
గురువు ముఖ్యంగా ఆరు రాశుల/ లగ్నాల వారికి శుభ ఫలితాలను ఇస్తున్నాడు.మేషరాశి, మిధునరాశి, సింహరాశి, వృశ్చికరాశి, ధనస్సురాశి, కుంభరాశి వారికి. ఇందులో ఎక్కువ శుభఫలితాలు కుంభరాశి లగ్నం వారికి అత్యంత అనుకూల శుభఫలితాలు ఉంటాయి. రాజయోగాకారకుడు అవుతున్నాడు.
ప్రతికూల ఫలితాలను చవిచూసే రాశుల/లగ్నాల ఆరు రాశుల వారు ఉన్నారు.
వృషభరాశి , కర్కాటకరాశి, కన్యారాశి , తులారాశి, మకరరాశి, మీనరాశి వారాలకు కొంత ప్రతికూలమైన ఫలితాలు ఉంటాయి.
– కేశవ