సాలకట్ల బ్రహ్మోత్సవాల వివరాలు ఇవే !

తిరమలలో ఏటా నిర్వహించే బ్రహ్మోత్సవాలు ఈసారి రెండుసార్లు నిర్వహించనున్నారు. దీనికి కారణం ఆశ్వీజమాసం అధికమాసంగా రావడం. మొదట సాలకట్ల బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. నిజ ఆశ్వీజంలో వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. ఈసారి కొవిడ్‌తో భక్తులను అనుమతించట్లేదు. ఏకాంతంగా బ్రహ్మోత్సవాలను నిర్వహించనున్నారు. చరిత్రలో ఇలా నిర్వహించడం తొలిసారి.

సాలకట్ల బ్రహ్మోత్సవాల వివరాలు
* సెప్టెంబర్ 19 నుండి 27వ తేదీ వరకు సాలకట్ల బ్రహ్మోత్సవాలు
* బ్రహోత్సవాలకు 18న అంకురార్పణ
* 15న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
* సెప్టెంబర్ 19న – ధ్వజారోహణం
* సెప్టెంబర్ 23న – గరుడసేవ
* సెప్టెంబర్ 24న – స్వర్ణరథోత్సవం(సర్వభూపాల వాహనం)
* సెప్టెంబర్ 26న – రథోత్సవం(సర్వభూపాల వాహనం)
* సెప్టెంబర్ 27న – చక్రస్నానం, ధ్వజావరోహణం.
కోవిడ్-19 నిబంధనల నేపథ్యంలో 24న స్వర్ణ రథోత్సవం, 26న రథోత్సవం ఉండని కారణంగా ఈ రెండు రోజుల్లో సర్వభూపాల వాహనంపై శ్రీవారు ఉభయదేవేరులతో కలిసి వేం చేస్తారు.
– శ్రీ