గత కొద్ది రోజులుగా భారత్ చైనా దేశాల సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. రెండు దేశాల సైన్యం సరిహద్దుల్లో భారీగా మోహరించి ఉంది. ఇంకేముందీ యుద్ధమే అనే వాతావరణం అక్కడ నెలకొని ఉంది. రెండు దేశాల బలగాలు భారీగా మోహరించాయి. అయితే ఈ ఉద్రిక్తతలు తగ్గించడానికి రెండు దేశాల సైనికాధికారులు అనేక దఫాలు చర్చలు జరిపారు. కానీ ఈ చర్చల వలన ఎలాంటి ఉపయోగం కనిపించలేదు.
కానీ నిన్న రష్యాలోని మాస్కోలో జరుగుతున్న షాంగై సహకార కూటమి సమావేశంలో ఇండియా, చైనా విదేశాంగ మంత్రుల మధ్య ఈ విషయాల మీద సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఇండియా విదేశాంగశాఖ మంత్రి జయశంకర్, చైనా విదేశాంగశాఖ మంత్రి వాంగ్ యి పాల్గొన్నారు. ఈ సమావేశంలో సరిహద్దుల్లో ఘర్షణ వాతావరణానికి బ్రేక్ వేసే దిశగా ఇరు దేశాల మధ్య ఒప్పందం కుదిరింది. ఇందుకు ఐదు అంశాలతో కూడిన ఒప్పందాన్ని మంత్రులు ఫైనల్ చేశారు. ఎల్‌ఏసీ నుంచి రెండు దేశాల సైన్యాలు సమదూరం పాటించాలని ఈ భేటీలో నిర్ణయించారు.