సనాతన ధర్మంలో భక్తి పాత్ర కీలకం. భగవంతుడి సాక్షాత్కారానికి భక్తి అత్యంత ప్రధానమైనది. ప్రాథమికమైనది కూడా. అయితే ఈ భక్తి అనేక రకాలు. అయితే మన పెద్దలు భక్తిని ప్రధానంగా నవవిధాలుగా వర్గీకరించారు. ఇవి భాగవతంలో పేర్కొన్నట్లు..
‘‘ శవణం కీర్తనం విష్ణోః స్మరణం పాదసేవనం ।
అర్చనం వందనం దాస్యం సఖ్యమాత్మ నివేదనమ్’’ ॥
ఈ నవవిధ భక్తిలో శ్రవణ భక్తికి పరీక్షితుడు, కీర్తనకు శుకమహర్షి స్మరణకు ప్రహ్లాదుడు, పాదసేవనమునకు మహాలక్ష్మీ, అర్చనమునకు పృథుమహారాజు, వందనమునకు అక్రూరుడు, దాస్యమునకు హనుమంతుడు, సఖ్యమునకు అర్జునుడు, ఆత్మనివేదనమునకు బలి మనకు ఉదాహరణలు.
ఈ నవవిధభక్తిలో దాస్యభక్తి అత్యంత ముఖ్యమైనది. ఈశ దాసభావము మానవుని మనుగడకు ఇహపర
సాధనకు, ఐహికామాష్మిక ఫలమునకు చక్కటి వస్తువు. అంతేకాక దాస్య భక్తికి ఉదాహరణము కూడ పై శ్లోకములో
‘కపిపతిద్ధాస” అంటే హనుమంతుడు. ఆయన రాముడికి దాసభక్తుడు. వాయుదేవుడు తన మూడు అవతారాలలో కూడ క్రమంగా హనుమ, భీమ, మధ్య్వాచార్యులుగా రామ, కృష్ణ వేదవ్యాసులవారి యందు దాస్యభక్తినే చేసియున్నాడు. దాస్య భక్తికి మూల పురుషుడు శ్రీహరియనియే చెప్పవచ్చు. దాస శబ్దము వినయ, వివేక, సౌశీల్యాది సద్దుణములను తెలియజేస్తుంది. అంతేకాక సదా సర్వత్ర భగవంతుని చూపించే సాధనము కూడ. ఎవరికి ఏ రకమైన భక్తి అనుకూలమో ఆ భక్తితో భగవంతుడిని చేరుకోవాలి.
-శ్రీ