గురువారం నాడు బృహస్పతిని పూజించడం వల్ల ఏం అవుతుందంటే…?

-

బృహస్పతి నవ గ్రహాల లో ఒకటి. గురువారం ఈ బృహస్పతిని పూజించడం చాల మంచిది కానీ ఈ విషయం చాల మందికి తెలియదు. బృహస్పతి గురు వారానికి అధిపతి. ఈ బృహస్పతిని గురుడు అని కూడా అంటాము. ఇది ఇలా ఉంటే గురువారం నాడు బృహస్పతిని పూజించడం వల్ల ఏం అవుతుంది…?, ఎలాంటి లాభాలు కలుగుతాయి..? ఇలా అనేక విషయాలు గురించి మీకోసం.

గురువారం నాడు ఉదయాన్నే స్నానమాచరించి నవ గ్రహాలను ప్రత్యేక భక్తి శ్రద్ధల తో పూజించడం వల్ల మంచి ఫలితం పొందొచ్చు అని పండితులు అంటున్నారు. శుక్ల పక్షం లో వచ్చే గురువారం నాడు బృహస్పతి గ్రహానికి పూజలు చేస్తే అష్టైశ్వర్యాలను పొందవచ్చు. ఇలా బృహస్పతిని గురువారం పూజించి స్వామి వారి ఎదుట నెయ్యి దీపం వెలిగించడం ద్వారా ఈతి బాధలు తొలగిపోయి సుఖ సంతోషాల తో గడుపుతారు.

ఇది ఇలా ఉంటే మరొకటి గుర్తుంచుకోవాల్సినది ఏమిటంటే..? ఆ రోజు గురుడుకి ఇష్టమైన ముల్ల పువ్వులు పెట్టాలి. గులాబీ వగైరా వాటితో పూజించడం మంచిది. అలానే శెనగల మాలను సమర్పించడం వల్ల కూడా మంచి జరుగుతుంది. గురువుకు ఆది దేవత అయిన బ్రహ్మను పూజించడం ద్వారా బుద్ధికుశలత, వికాసం కలుగుతుంది. అలానే గాయత్రీ మంత్రాన్ని108 సార్లు పఠించడం వల్ల సమస్త దోషాలు నుండి బయట పడొచ్చని పండితులు చెప్పడం జరిగింది.

Read more RELATED
Recommended to you

Latest news