ప్రపంచంలో అత్యంత ఎక్కువ ఆలయాలు, కట్టడాలు ఉన్న దేశం మనది. మత పరమైన నిర్మాణాలు కూడా మన దగ్గరే అధికంగా ఉన్నవి. ఇక ధర్మభూమిగా పేరుగాంచిన భారత దేశంలో పురాణ ప్రాధాన్యత కలిగిన దేవాలయాలతో పాటు కొన్ని విచిత్రమైన దేవాలయాలు కూడా ఉన్నాయి. ఆ రహస్యాలు కనుగొనడం చాలా కష్టమని చెప్పాలి. మరియు కొన్ని విచిత్ర ఆచారాలు ఉంటాయి. ఇక హిందూ సంప్రదాయంలో దేవాలయ దర్శనం కష్టాలను, కలతలను తొలగిస్తుందనే నమ్మకం పై జరుగుతుందనేది అందరూ చెప్పే మాట. అందుకే పెళ్లి తర్వాత కొత్త దంపతులు తమ కాపురంలో ఏ కలతలు రానివ్వకూడదని దగ్గర్లోని దేవాలయాలకు వెళ్లి ప్రత్యేక పూజలు చేస్తుంటారు.
ఇలా ప్రతి శుభ కార్యంలో భార్యభర్తలు జంటగా పూజలు చేస్తారు. అయితే ఇందుకు విరుద్ధంగా దేశంలో ఒకే ఒక చోట మాత్రం ఓ దేవాలయానికి జంటగా దంపతులు వెళ్లకూడదు. భర్త దేవాలయం బయట ఉంటే, భార్య దేవాలయంలోకి వెళ్లి మూలవిరాట్టును దర్శనం చేసుకుని రావాలి. అటు పై భర్త వంతు వస్తుంది. వివరాల్లోకి వెళ్తే.. శిమ్లాకు దగ్గరగా ఉనక్న రామ్ పూర్ అనే గ్రామంలో దుర్గామాత ఆలయం ఉంది. ఈ దేవాలయంలోకి జంటగా అంటే ఒకే సారి దంపతులు వెళ్లకూడదని స్థానికులు చెబుతారు.
దీనిని దిక్కరించి వెళ్లివారికి విడాకులు వచ్చాయనేది వారి కథనం. ఈ సంప్రదాయం చాలా ఏళ్లుగా అమల్లో ఉంది. స్థానికులే కాకుండా బయట నుంచి వచ్చిన వారు కూడా ఈ నిబంధనను ఎవరూ అతిక్రమించరు. అయితే పార్వతి దేవి శాపం వల్లే ఈ ఆచారం వచ్చిందని చెబుతున్నారు. అందువల్లే ఇక్కడకు వచ్చే దంపతుల్లో మొదట ఒకరు అటు పై మరొకరు ఈ దేవతను దర్శించుకుంటారు కాని ఎట్టి పరిస్థితుల్లోనూ జంటగా మాత్రం దేవతను పూజించరు.