పంచ సరోవరాలు మీకు తెలుసా ?

-

భారత దేశం కర్మభూమి. ఎన్నో పవిత్ర క్షేత్రాలకు, తీర్థాలకు నెలవు. పవిత్ర తీర్థాలలో స్నానం, దానం, జపం, ధ్యానం చేస్తే అనంత ఫలితాలు వస్తాయనేది పండితుల అభిప్రాయం. అంతేకాదు ఎందరికో మంచి జరిగిందన్న ఉదంతాలు ఉన్నాయి.

మన సంప్రదాయాలలో తీర్థయాత్రలకు చాలా ప్రాముఖ్యత వుంది. ప్రస్తుతం తీర్థం అంటే ఓ క్షేత్రమనే అర్థాన్నే అన్వయించుకుంటున్నాము. అయితే వేదకాలంలో తీర్థమనే పదానికి సరస్సు అర్థం కూడ ఉండేది. అలా తీర్థాలకు చేసే యాత్రలనే తీర్థయాత్రలని పిలుచుకుంటున్నాం. దేశంలో ఎన్నో సరోవరాలు ఉండగా, వాటిలో ఐదు ‘పంచ సరోవరాలు’ గా ప్రసిద్ధికెక్కాయి. అవి .. మానస సరోవరం, పంపా సరోవరం, పుష్కర్‌ సరోవరం, నారాయణ సరోవరం, బిందు సరోవరం,
మానస సరోవరం ప్రధానమైనది. సమస్త లోకాలలో మానస సరోవరం వంటి పవిత్ర సరోవరం మరొకటి లేదన్నది వాస్తవం. ఈ సరోవరం బ్రహ్మదేవుని మనస్సు నుంచి ఉద్భవించింది. అందుకే దీనిని గతంలో ‘బ్రహ్మసరం’ అని పిలిచేవారు.

ఇది ఎన్నో పవిత్రనదులకు పుట్టినిల్లు. ఈ సరోవరం చెంతనే గంగను దివి నుంచి భువికి తెప్పించడానికి భగీరథుడు తీవ్రమైన తపస్సు చేశాడు. మన పురాణాలలో మానస సరోవర ప్రస్తావన అక్కడక్కడా కనిపిస్తూంటుంది. ఈ సరోవరాన్ని బ్రహ్మదేవుడు ఆదిదంపతుల కోసం సృష్టించాడని పురాణ కథనం. ఈ మహిమాన్వితమైన మానస సరోవరం సముద్ర మట్టానికి సుమారు 14, 900 అడుగుల ఎత్తులో ఉంది. ఈ సరోవరం చుట్టుకొలత దాదాపు 54 మైళ్ళు అని అంటారు. 200 చదరపు మైళ్ళ విస్తీర్ణంలో పరుచుకుని ఉన్న ఈ సరోవరం సుమారు 300 అడుగుల లోతు ఉంటుంది. మిగిలిన సరోవరాలు దేశంలోని ఆయా ప్రాంతాలలో ఉన్నాయి.

– కేశవ

 

Read more RELATED
Recommended to you

Exit mobile version