కేరళలోని పవిత్రమైన శబరి హిల్స్ వద్దే కాకుండా లార్డ్ అయ్యప్ప దేవాలయాలు అనేకం ఉన్నాయి. అయితే అయ్యప్ప పూజా సాంప్రదాయం ఎక్కువగా దక్షిణ భారత దేశంలో ఉంది. దక్షిణ, ఉత్తర భారత దేశంలోనే కాక ఇతర దేశాలలో కూడా అయ్యప్ప ప్రభావం వ్యాపించింది. కొత్త అయ్యప్ప దేవాలయాలు ఉద్భవించాయి. అటువంటి అయ్యప్ప పుణ్యక్షేత్రం కేరళలోని పశ్చిమం వైపు బెంగుళూర్ లో కల జాలహళ్లి లో గల దేవాలయం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటుంది.
అయ్యప్పను హరిహర సుతుడు అని, శ్రీ ధర్మ శాస్త్రా అని పిలుస్తారు. అయ్యప్ప ఆలయం బెంగుళూర్ నుండి 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది బియిఎల్ సర్కిల్ నుండి 5 కి మీ దూరంలో ఔటర్ రింగ్ రోడ్ లో ఉంది. ఇక్కడ ఆలయం కేరళ శైలి లోనే నిర్మించారు. ఇక్కడ దేవాలయంలోకి అడుగుపెడుతూనే ఒక పొడవైన జెండా కర్ర అంతా బంగారు పూత తో కూడి ఉంటుంది. ఇక్కడ ప్రధాన దైవం అయ్యప్ప. అంతేకాక గణపతి, దేవి, సుబ్రమణ్య, నాగరాజ మరియు నవ గ్రహాల ఉప ఆలయాలు ఉన్నాయి. ఈ ఆలయాన్ని 2004 పుననిర్మించారు.
ఇక్కడ శబరిమల నమూనాలతో ఈ ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయం ఏడాది పొడవునా పేదలకు నిత్య అన్నదానం అందిస్తుంది. దీని ప్రాంగణంలో ఒక గ్రంథాలయం ఉంది. ఇక్కడి అయ్యప్పని కుల, మత బేధం లేకుండా అందరు దర్శించుకోవచ్చు. దేవాలయం యొక్క వార్షిక ఉత్సవం ధనుర్మాసం ప్రారంభంలో జరుగుతుంది. ఈ ఆలయంలో ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు మరియు మతపరమైన కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ క్షేత్రం లోని అయ్యప్ప భక్తుల కోరికలు తీర్చే దైవంగా పేరు గాంచాడు.