హంసల దీవి గురించి మీకు తెలియని విశేషాలు…!

-

కృష్ణా నది సముద్రంలో కలిసే అందమైన ప్రదేశంలో సత్యభామ, రుక్మిణీ సమేత శ్రీ వేణు గోపాల స్వామి ఆలయం ఉంది. దీన్ని దేవతలు నిర్మించారని చరిత్ర చెబుతోంది. అంతే కాదు మహర్షులు, దేవతలకు మధ్య అనేక విషయాలు జరిగిన ప్రదేశం కూడా ఇది. దీన్ని చూడటానికి పిల్లలు, పెద్దలు కూడా ఎంతో ఆసక్తి చూపుతారు. ఎందుకంటే ఇక్కడి దైవాన్ని దేవతలు ప్రతిష్టించారు అని ,సముద్ర తీరంలో చల్లని ఆహ్లాదకరమైన వాతావరణం లో సేద తీరడానికి అందరూ వయసుతో సంబంధం లేకుండా ఇష్టపడతారు.

హంసలదీవి, ఇది విజయవాడ నుంచి 110 కి.మి దూరంలో ఉంది. అవని గడ్డ నుంచి 25 కి.మి. దూరం. ఇక్కడి నుండి బస్ సౌకర్యం ఉంది. పూర్వం పాపాత్ములు అందరూ గంగా నదిలో స్నానాలు చేసి తమ పాపాలు పోగొట్టుకునే వారు. ఆ పాపాల విముక్తి కై గంగ మహావిష్ణువు ని శరణు వేడుకుంది. దానికి విష్ణుమూర్తి నువ్వు పాపాల కారణం గా నల్లగా మారిపోయావు. నువ్వు అన్ని పవిత్ర తీర్థాలలో స్నానం చేస్తూ వెళ్లు, ఎక్కడ నీ మాలిన్యం పోయి తెల్లని హంసలాగా స్వచ్ఛంగా మారతావో అది ప్రసిద్ధ పుణ్య క్షేత్రం అవుతుంది అని చెప్పాడు.

ఆ విధంగా కాకి రూపం లో వున్నగంగ అన్ని నదులలో స్నానం చేస్తూ కృష్ణవేణి సాగర సంగమంలో కూడా చేసింది.అప్పుడు ఆవిడకు కాకి రూపం పోయి తెల్లని హంస రూపం వచ్చింది. అందుకే దీనికి హంసల దీవి గా పేరు వచ్చింది. అని ఒక పురాణ గాథ. పూర్వం దేవతలు ఈ ఆలయాన్ని నిర్మించినట్లు తెలుస్తోంది కదా ! వారు ఒక రాత్రి లోనే ఈ ఆలయాన్ని నిర్మించినట్లు తెలుస్తోంది ఐతే కోడి కూసే సమయానికి రాజ గోపురం సగమే ఐయ్యింది కానీ వారు తెల్లవారి పోయింది అని దాన్ని అలాగే వదిలేసి వెళ్లిపోయారు. తరువాత కాలంలో చోళ, మౌర్య రాజుల కాలంలో ఆలయ పునరుద్దరణ జరిగినా ఆ గాలి గోపురం అసంపూర్తిగానే వదిలేశారు.

Read more RELATED
Recommended to you

Latest news