రాధిక అమ్మ కాదు.. అలా పిలుస్తా : వరలక్ష్మీ శరత్ కుమార్

-

వరలక్ష్మీ శరత్‌కుమార్.. ధైర్యానికి, తెగువకు మారుపేరు. ఎవరిమీదైనా సరే శివంగిలా విరుచుకుపడుతుంది. తనకు తోచిందే చేస్తూ.. తోచిందే మాట్లాడుతూ అందరిలోనూ ఓ ప్రత్యేకతను చాటుకుంది. తమిళ, తెలుగులో సినిమాలో ఫేమస్ అయిన శరత్ కుమార్ కూతురే వరలక్ష్మీ. హీరోయిన్ పాత్ర, నెగెటివ్ పాత్ర, గెస్ట్ రోల్ ఇలా ఏదైనా సరే తన స్టైల్లో అదరగొట్టేస్తుంది.

క్యాస్టింగ్ కౌచ్ పైనా, మీటూ ఉద్యమంలోనూ సంచలన ఆరోపణలు చేసి వార్తల్లోకెక్కింది. తనను కూడా అడ్జస్ట్ కావాలని అడిగారని, నటుడి కూతురినైనా తనకు వేధింపులు ఎదురయ్యాయని తెలిపింది. కానీ ఎన్నడూ వాటికి తలొగ్గలేదని, అలా అడిగినవారి చెంప పగలగొట్టానని బహిరంగంగానే చెప్పుకొచ్చింది. తాజాగా మాట్లాడుతూ.. రాధికా శరత్ కుమార్ గురించి మాట్లాడింది.

రాధిక తనకు అమ్మ కాదని, మా నాన్న భార్య అంతేనని చెప్పుకొచ్చింది. ఎవ్వరికైనా అమ్మ ఒక్కరే ఉంటారని, తను అమ్మ కాదని అందుకే ఆంటీ అని పిలుస్తానని చెప్పుకొచ్చింది. శరత్ కుమార్-చాయలకు పుట్టిన కూతురు వరలక్ష్మీ. శరత్ కుమార్ రాధికను 2000లో రెండో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news