మీ అల్మైరాలో ఇది ఉంటే.. లక్ష్మీకటాక్షమే!

సాధారణంగా మనం ఏ పూజాపురస్కారాలు చేసినా.. ఆరోగ్యం, ధనం, క్షేమం కోసమే! అయితే, ఇవి వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని నియమాలు పాటిస్తే మీకు లక్ష్మిదేవి అనుగ్రహం లభించే వద్దన్నా డబ్బు వస్తూనే ఉంటుంది. ఆ నియమాల్లో ఒకటి తెలుసుకుందాం. వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని వస్తువులను ఎక్కడో పెట్టాలో.. ఎక్కడ పెట్టకూడదో తెలుకుంటూనే ఉంటున్నాం. అందులో భాగంగానే మీ ఇంట్లోనే ఉన్న కప్‌బోర్డులో ఈ వస్తువు పెడితే మీ సంపదన పెరుగుతుంట. అంతేకాదు మీకు సుఖసంతోషాలు లభిస్తాయి. ఎప్పటికీ ఆ లక్ష్మీదేవి ఆశీర్వాదాలు మీతోనే ఉంటాయి.

మీరు.. మీ కుటుంబం ఎల్లప్పుడూ సుఖ సంతోషాలు ప్రాప్తించాలంటే పసుపు ముద్దను అల్మైరాలో పెట్టుకోవాలి. దీన్ని ప్రత్యేకంగా ఎక్కడైతే డబ్బులు భద్రపరుస్తామో అక్కడ పెట్టాలి. ఒకవేళ కప్‌బోర్డు ఉన్నా… వేరే ఎటువంటి డబ్బు దాచి ఉంచే ప్రదేశాలైనా.. ఒక పసుపు ముద్దను పెట్టి ఉంచండి. అతి త్వరలోనే మీకు లక్ష్మీ దేవి అనుగ్రహం లభించి కోటిశ్వరులు అవుతారని వాస్తు శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. పసుపు మన సాంప్రదాయంలో దానికి ప్రత్యేక స్థానం ఉంది. దీన్ని శుభ సూచకంగా పరిగణిస్తాం. ప్రతి వేడుకల్లో కూడా పసుపు లేనిదే ఏ వేడుక ప్రారంభించం. కొన్ని పూజల్లో పసుపును లక్ష్మీగణమతి ప్రతిమగా పూజిస్తాం . అటువంటి పసుపును ఇలా మీ ఇంటి కప్‌బోర్డ్‌ లేదా అల్మైరాలో డబ్బు దాచి ఉంచే ప్రదేశంలో పెట్టడం వల్ల మీకు అఖండ ఐశ్వర్యం ప్రాప్తిస్తుందని వాస్తుశాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు.