మహాశివరాత్రి విశిష్టత, తప్పక పాటించాల్సిన విషయాలు మీకోసం..!

-

హిందువులు ఎన్నో పండుగలను జరుపుకుంటారు. అయితే వాటిలో శివరాత్రి కూడా ఒకటి. మహా శివ రాత్రి నాడు పరమ శివుడిని పూజిస్తారు. అదే ఈ పండుగ ప్రత్యేకత కూడా. ఈసారి మహాశివరాత్రి మార్చి ఒకటవ తేదీన వచ్చింది. ప్రతి ఏడాది కూడా ఫాల్గుణ మాసంలోని కృష్ణపక్ష చతుర్దశి నాడు శివరాత్రి జరుపుకుంటారు.

మహా శివరాత్రి ప్రాముఖ్యత:

మహా శివరాత్రి నాడు శివుడికి పెద్ద ఎత్తున పూజలు చేస్తారు. శివాలయాల్లో శివుడికి అభిషేకాలు, పూజలు చేస్తారు. భక్తులు కూడా పెద్ద ఎత్తున ఆలయాలకు వస్తారు. కొన్ని ఊర్లలో అయితే శివరాత్రి నాడు తీర్ధాలు వంటివి జరుపుతారు. మహా శివరాత్రి నాడు శివుడికి పూజించి శివుడని మెప్పిస్తారు భక్తులు.

అలానే ఉపవాసం, జాగారం కూడా చేస్తారు. అయితే మహాశివ రాత్రి నాడు పార్వతీ మాత లాగ కోరుకున్న వాటిని పొందడానికి అమ్మాయిలు పూజలు చేసి ఉపవాసం ఉంటారు. ఉపవాసం ఉండడం వల్ల పుణ్యం వస్తుంది. శివుడిని ఆరాధిస్తే కష్టాలు కూడా తొలగిపోతాయి అని నమ్ముతారు.

శివరాత్రినాడు శివ మంత్రం, మృత్యుంజయ మంత్రం పఠిస్తారు. అలానే ఆ రోజు బ్రహ్మ ముహూర్తం లో స్నానం చేసి దీపం పెట్టి పూజ చేస్తే పుణ్యం లభిస్తుంది. పరమశివుని కటాక్షం లభించి ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండొచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version