ఆ దేవాల‌యంలో ఉద‌యం 4 గంట‌ల‌కు ఏం జ‌రుగుతుందో తెలిస్తే షాక్‌..!

-

ఓ శివాల‌యంలో ప్ర‌తి రోజు తెల్ల‌వారుజామున మ‌హా అద్భుతం జ‌రుగుతుంది. ప్ర‌తి రోజు ఉద‌యం పూజారి గుడి త‌ల‌పులు తీసేస‌రికి ఆశ్చ‌ర్యాన్ని క‌లిగించే దృశ్యాన్ని చూడ‌వ‌చ్చు. పూజారి గర్భ గుడి త‌ల‌పులు తెరిచే స‌రికే అత్యంత శోభ యంతో అర్చించి పువ్వులతో అభిషేకింపబడిన లింగ స్వరూపం దర్శనం ఇస్తుంది. అయితే ఇది ఎవ‌రు చేస్తున్నారు ? ఎలా జ‌రుగుతుంది ? అన్న‌ది మాత్రం ఇప్ప‌టి వ‌ర‌కు మిస్ట‌రీగానే ఉంది. ఈ చిక్కుముడిని ఇప్ప‌టి వ‌ర‌కు ఎంత విప్ప‌లేక‌పోయారు.

మ‌రి వివ‌రాల్లోకి వెళ్తే.. ఉరానలోని పహాట్ గేట్‌కి పద్నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్నా ఒక్క దట్టమైన అడవిలోకి వెళ్ళాలి. అక్కడే ఎతైన కొండ మీద కొలువై ఉంది మహా శివుడు ఆలయం. ద‌ట్ట‌మైన అడ‌వుల్లో కొలువై ఉన్న ఈ ఆల‌యంలో పూజారి బ్రహ్మ మూహూర్తంలో గర్భ గుడిని తెరుస్తాడు. కానీ అప్ప‌టికే అక్కడ ఎవరో పూజ చేసినట్లుగా కనిపిస్తుంది. శివుని పై బిల్వ దళాలు, పూలు అందంగా అలంకరించి ఉంటాయి.

మ‌రి ఈ మిస్ట‌రీని చాలా మంది చేధించేందుకు ప్ర‌య‌త్నాలు చేశారు. పూర్వం ఒక రాజు బంచ్వాల్ సింగ్ తన గూఢచారులను కాప‌లాగా ఉంచాడు. కానీ వాళ్లు ఉద‌యం అయ్యే స‌రికి సృహ కోల్పోయి ఉండేవారు. అదే విధంగా ఇంకా ఎంద‌రో అక్క‌డ కాప‌లా కాసారు. కానీ ఎన్నో ల‌క్ష‌ల ప్ర‌య‌త్నాల త‌ర్వాత బ్రహ్మ మొహూర్తానికి వాళ్ళ కళ్ళు వాడి పోయేవి. ఇక ఈ ర‌హ‌స్యం ఇప్ప‌టికీ మిస్ట‌రీగానే కొన‌సాగుతుంది.

అయితే ఓ క‌థ‌నం ప్ర‌కారం.. ప్ర‌తి రోజు తెల్ల‌వారుజుమున 4 గంట‌ల‌కు ఓ సిద్ద యోగి పూజలు చేస్తుంటాడంట. కానీ అయన ఎవరో? ఎక్కడ నుండి వస్తాడు? అన్న విష‌యం ఎవరు కనిపెట్టకలేకపోయారు. ఇలా ఎన్నో క‌థ‌నాలు ఉన్నాయి కానీ.. వాటిపై స్ప‌ష్ట‌త లేదు. ఇక్క‌డ మ‌రో విచిత్రం ఏంటంటే.. అక్కడ ఒక బిల్వ వృక్షం కూడా వుంది. సాధార‌ణంగా బిల్వ దళాలు మూడు ఆకుల సముదాయాన్ని కలిగి ఉంటాయి. కానీ ఇక్కడ ఐదు నుండి ఏడు ఆకుల సముదాయాన్ని కలిగి ఉంటాయ‌ట‌.

Read more RELATED
Recommended to you

Latest news