కార్తీక మాసంలో ఈ 3 చోట్ల దీపాలను పెడితే చాలా మంచిదట..!

-

కార్తీకమాసంలో దీపారాధన చేస్తే చాలా మంచి జరుగుతుంది. శివ కేశవులు ఇద్దరికీ ఈ నెల అంటే చాలా ఇష్టం. హిందూ సంప్రదాయంలో కార్తీక మాసాన్ని ఆధ్యాత్మిక సాధనకి, మోక్ష సాధనకి విశిష్టంగా భావిస్తారు. కార్తీక మాసంలో దీపం, దానం, జపం వంటివి చేస్తే ఎంతో మంచి ఫలితం ఉంటుంది. శివాలయం, విష్ణు దేవాలయాల్లో దీపాలని వెలిగించడం వలన కూడా ఎంతో మంచి జరుగుతుంది. ఆర్థిక ఇబ్బందుల నుంచి కూడా గట్టెక్కచ్చు.

అనుకున్న కోరికలు కూడా నెరవేరుతాయి. కార్తీకమాసంలో చాలామంది సాయంత్రం శివాలయాల్లో దీపాలు పెడతారు అయితే ఆలయాల్లో దీపాలు పెట్టే వాళ్ళు ఈ మూడు ప్రదేశాల్లో కచ్చితంగా దీపం పెట్టండి. మొట్టమొదటితే గోపుర ద్వారం. ఆలయానికి వెళ్ళగానే గోపురం మనకు కనపడుతుంది.

అక్కడ దీపారాధన చేయండి. అలాగే నందీశ్వరుడు దగ్గర కూడా దీపాన్ని పెట్టడం మంచిది. గర్భగుడిలో ఈశ్వరుడి దగ్గర కూడా దీపాన్ని పెడితే మంచిదట. ఇలా దీపారాధన చేయడం వలన మంచి జరుగుతుంది కాబట్టి శివాలయాల్లో దీపాలని కార్తీకమాసంలో పెట్టేటప్పుడు వీలైనంత వరకు ఈ మూడు ప్రదేశాల్లో పెట్టేటట్టు చూసుకోండి అప్పుడు ఇంకా మంచి ఫలితం ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news