బిగ్‌బాస్‌లో శ్రీముఖికి పెద్ద దెబ్బ ప‌డ‌నుందా..!

-

బిగ్ బాస్ 3 ఫైనల్ లో శ్రీముఖి, రాహుల్, బాబా భాస్కర్, వరుణ్ సందేశ్, అలీ రెజా ఉన్నారు. టైటిల్ ఫెవరెట్ గా శ్రీముఖి, బాబా, రాహుల్ ఉన్నట్టు అంచనాలు వెలువ‌డుతున్నాయి. నిన్నటి వరకు శ్రీముఖి పోటీగా బాబా భాస్కర్ రేసులో ఉంటారని అందరూ అనుకోగా… ఇప్పుడు సడన్ గా సింగర్ రాహుల్ సైతం శ్రీముఖి కి గట్టి పోటీ ఇస్తున్నాడు. ఇక మొదటి నుంచి శ్రీముఖి హౌస్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా ఉండటం తో  పాటు బయట కూడా ఆమెకు ఫాలోవర్స్ బాగా ఉండడంతో ఆమె ఖచ్చితంగా బిగ్ బాస్ విన్నర్ అవుతారని ఎక్కువ మంది భావిస్తున్నారు.

ఇక బయట రాహుల్ సిప్లిగంజ్ ని సపోర్ట్ చేసే తోటి సింగర్స్ కూడా రాహుల్ ఫైనల్ విన్నర్ కావాలంటూ తెగ ప్రమోట్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే బిగ్ బాస్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా రేస్ లో ఉన్న శ్రీముఖి గురించి బయటికి వస్తున్న కంటెస్టెంట్ లు చేస్తున్న వ్యాఖ్యలు సంచలనంగా మారుతున్నాయి.
ప్రతి వారం హౌస్‌ నుంచి ఎలిమినేట్ అవుతున్న వారు శ్రీముఖి  ఆటపై కాంట్రవర్సీ కామెంట్లు చేస్తున్నారు. ఆమె పక్కాగా బిగ్ బాస్ గేమ్ ఆడుతోందని అందువల్ల మిగిలిన కంటెస్టెంట్లు బ‌ల‌వుతున్నార‌ని చాలామంది కంటెస్టెంట్లు ఆరోపిస్తున్నారు.

Sreemukhi

ఇప్పటికే హిమజ, అషు రెడ్డి, మహేష్ విట్టా శ్రీముఖిపై సంచలన వ్యాఖ్యలు చేసారు. ఇప్పుడు ఫస్ట్ వీక్ లోనే ఎలిమినేట్ అయిన హేమ సైతం ఈ లిస్టులో చేరింది. శ్రీముఖి చాలా ప్లాన్ తో గేమ్ ఆడుతుందని… బిగ్ బాస్ ఎడిటర్స్ హౌస్ లో జరిగే చెడునే చూపిస్తున్నారు కానీ, మంచి చూపడం లేదని ఆమె ఆరోపించారు. , ఫైనల్ విన్నర్ గా నిలిచేందుకు శ్రీముఖి అందరిని గ్రిప్ లో పెట్టుకుంది.. అంటూ హేమ చేసిన వ్యాఖ్యలు శ్రీముఖి ఓట్ల‌ పై తీవ్ర ప్రభావం చూపుతుంద‌ని అంటున్నారు.

శ్రీముఖి ఫైనల్ రేస్ లో మిగిలిన కంటెస్టెంట్ నుంచి గట్టి పోటీ ఎదుర్కొంటున్న తరుణంలో ఎలిమినేట్ కంటెస్టెంట్లు చేసిన వ్యాఖ్యలు ఆమెకు నెటిజన్ల ఓటింగ్ విషయంలో మైనస్ గా మారాయని అంటున్నారు. ఇక రెండు రోజుల క్రితమే సింగర్ రాహుల్ సైతం బిగ్ బాస్ తొలి సీజన్ పై చేసిన కామెంట్లో వీడియో బయటకు వచ్చిన సంగతి తెలిసిందే.. ఇప్పుడు శ్రీముఖి గురించి చేసిన వ్యాఖ్యలు ఆమెకు ఎంతవరకు మైనస్ అవుతాయో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news