ఇవాళ వినాయక చవితి. చాంద్రమానం ఆధారంగా భాద్రపద శుద్ధ చవితిని వినాయక చవితిగా జరుపుకుంటాం. ఏ పని చేయాలన్నా ముందు వినాయకుడికే పూజ చేస్తుంటాం. గణపతి పూజలో గరిక తప్పకుండా ఉంటుంది. ఎందుకంటే గణపతికి గరిక అంటే చాలా ఇష్టం. గరికతో పాటు గన్నేరు పూలతో వినాయక చవితి రోజున వినాయకుడికి పూజ చేస్తే కష్టాలన్నీ తొలగిపోతాయట. అలాగే దూర్వార పత్రంతో గణేశుడికి పూజ చేస్తే శనిదోషాలు పోతాయట. చాలామంది శని దోషంతో బాధపడుతుంటారు. ఏ పని చేయాలన్నా అడ్డంకులు వస్తుంటాయి. అటువంటి వారు ఈ దూర్వార పత్రపూజ చేస్తే శని దరిదాపులోకి కూడా రాకుండా పోతుంది. వినాయక చవితి నాడు చాలా మంది 21 రకాల పత్రులతో వినాయకుడికి పూజ చేస్తుంటారు. వాటిలో అన్నింటి కనన్నా ముఖ్యమైంది మాత్రం దూర్వార పత్రమే. దాంతో గణేశ్ కు పూజ చేస్తే సకల పాపాలు తొలగి గణపతి అనుగ్రహం కలుగుతుందంటూ పండితులు చెబుతున్నారు.