అయ్యప్య సేవలు ఇక ఆన్‌లైన్‌లో !

-

అయ్యప్పస్వామి మాలలు ప్రారంభమైనవి. అన్నీ దేవాలయాల్లాగే ఇకపై శబరిమలలో కూడా ఆయా సేవలకు సంబంధించిన పోర్టల్‌ ప్రారంభమైంది. శబరిమల వెళ్లే యాత్రికుల సౌకర్యార్థం కేరళ ప్రభుత్వం, పోలీస్‌ శాఖ, ట్రావెన్‌కోర్‌ దేవస్థానం బోర్డు సంయుక్తంగా ఒక ఆన్‌లైన్‌ sabarimalaonline పోర్టల్‌ను రూపొందించింది.

దీని ద్వారా యాత్రికులు వారం రోజులు ముందుగానే దర్శన స్లాట్‌లను, స్వామివారి ప్రసాదాలను ఉచితంగా బుక్‌ చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు. ఇందులో రెండు రకాల దర్శనాలను ఎంపిక చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ రెండు సేవలను పొందడానికి యాత్రికులు ఈ పోర్టల్‌ ద్వారా ముందుగానే నమోదు చేసుకోవచ్చు. భక్తుల వ్యక్తిగత సమాచారము, వయస్సు, చిరునామా, ఆధార్‌ కార్డ్‌, ఫొటో గుర్తింపు కార్డులను సమర్పించాలి.

బుకింగ్‌ పూర్తి అయిన తరువాత రిజిస్ట్రేషన్‌ చేసుకున్న యాత్రికునికి ఆటోమేటిక్‌గా ఎస్‌ఎంఎస్‌ ద్వారా దర్శనం తేదీ, సమయం, స్లాట్‌ వివరాలను ఈ-మెయిల్‌లో పంపిస్తారు. వీటి సాయంతో సదరు యాత్రికుడు తనకు వచ్చిన బార్‌కోడ్‌ ఉన్న టికెట్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవలసి ఉంటుంది. ఈ టికెట్‌ను, రిజిస్ట్రేషన్‌ సమయంలో ఉపయోగించిన ఫొటో గుర్తింపుకార్డును యాత్రికులు దర్శనానికి వెళ్లేటప్పుడు తమ వెంట కచ్చితంగా తీసుకువెళ్లాలి.

– కేశవ

Read more RELATED
Recommended to you

Latest news