మెగాస్టార్ హీరోయిన్ కోసం ట్ర‌యాంగిల్ ట్విస్ట్‌..!

-

సైరా లాంటి భారీ బడ్జెట్ మూవీ తరువాత చిరంజీవి మరో క్రేజీ డైరెక్టర్ తో మూవీకి సిద్ధమయ్యారు. టాలీవుడ్‌లో వ‌రుస‌గా స‌క్సెస్ ఫుల్ హిట్ల‌తో దూసుకుపోతోన్న కొర‌టాల శివ – చిరంజీవి కాంబినేష‌న్లో సినిమా తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. తొలి సినిమా మిర్చి నుంచి భ‌ర‌త్ అనే నేను సినిమా వ‌ర‌కు కొర‌టాల ప్లాప్ అన్న‌దే లేకుండా దూసుకు పోతున్నాడు. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు కొర‌టాల‌తో సినిమా చేసేందుకు స్టార్ హీరోలు సైతం క్యూలో ఉండాల్సిన ప‌రిస్థితి.

త్వ‌ర‌లోనే సెట్స్ మీద‌కు వెళ్ల‌నున్న ఈ సినిమా కోసం చిరు జిమ్‌లో ఓ రేంజ్‌లో క‌స‌ర‌త్తులు చేస్తున్నాడు. ఈ సినిమాలో చిరు లోక్ చాలా స్టైలీష్‌గా ఉంటుంద‌ని టాక్‌. అందుకే కొర‌టాల సూచ‌న‌ల మేర‌కు చిరు జిమ్ లో కఠిన కసరత్తులు చేస్తున్నారు. ఈ సినిమాలో చిరు సరసన చేసే హీరోయిన్ విష‌యంలో తీవ్ర త‌ర్జ‌న భ‌ర్జ‌న‌లు జ‌రుగుతున్నాయి.

ఇక లేటెస్ట్ టాక్ ప్ర‌కారం ఈ సినిమాలో చిరు ప‌క్క‌న న‌టించే హీరోయిన్ల కోసం ట్ర‌యాంగిల్ ట్విస్ట్ ఉందట‌. ఇప్ప‌టికే నయనతార, త్రిషా పేరు ప్రముఖంగా వినిపించాయి. ఈ ఇద్ద‌రు ఏజ్డ్ హీరోయిన్లు కావ‌డంతో పాటు వీరు గ‌తంలో చిరుతో న‌టించారు. అందుకే వీరిలో ఎవ‌రో ఒక‌రు ఫైన‌ల్ అవుతార‌ని అంద‌రూ అనుకున్నారు.

ఇప్పుడు స‌డెన్‌గా శృతీహాస‌న్ పేరు కూడా లైన్లో ఉంది. శృతి – చిరు కాంబినేష‌న్ అయితే కాస్త క్రేజీగా ఉంటుంది. ఆమె ఇప్ప‌టికే చెర్రీ, ప‌వ‌న్ ప‌క్క‌న న‌టించింది. ఇక త్వ‌ర‌లోనే కొర‌టాల హీరోయిన్ మరియు మ్యూజిక్ డైరెక్టర్ పేర్ల‌ను ప్ర‌క‌టించ‌నున్నార‌ట‌.

Read more RELATED
Recommended to you

Latest news