అక్షయ తృతీయ రోజు బంగారం కొనాలా? వద్దా..?

-

బంగారం సాధారణంగా ఒక లోహం. కానీ ప్రపంచవ్యాప్తంగా దానికి ఉన్న ప్రత్యేకత గురించి వివరించాల్సిన పనిలేదు. భారతీయులు దాన్ని ఒక పవిత్ర లోహంగా.. దైవ సంబంధ లోహంగా భావిస్తారు. ఇటువంటి ఈ లోహం గండకీ నదిలో వైశాఖ తదియ నాడు మొదటిసారి ఉద్భవించింది. విష్ణు అంశతో కూడిని లోహంగా బంగారం ప్రతీతి.

అక్షయ తృతీయను అక్షయ తీజ్ అని కూడా పిలుస్తారు. ఇది హిందువులకు, జైనులకు చాలా ముఖ్యమైన పండుగ. సూర్య, చంద్రులు ఇద్దరికి సంబంధించిన విశేషంతో కూడికున్నది ఈ పండుగ. సూర్యుడు వైశాఖ మాసంలో తీవ్ర ప్రతాపంతో ఉండగా, చంద్రుడు శుక్లపక్షంలో తదిత తిథినాడు ప్రకాశవంతంగా చిన్న రేఖతో అలరారుతుంటాడు. ఐశ్వర్యకారకుడైన శివునిపై ఉన్న చంద్ర రేఖ తదియ చంద్రరేఖనే. కాబట్టి ఈ రోజున అనేక విశేషాలు ఉన్నాయి. అదేవిధంగా చంద్రుని భార్యల్లో ముఖ్యమైన రోహిణితో కలిసి ఉండటం ఈ రోజు మరో ప్రత్యేకత.

బంగారానికి అక్షయ తృతీయకి సంబంధం ఏంటి?

బంగారం సాధారణంగా ఒక లోహం. కానీ ప్రపంచవ్యాప్తంగా దానికి ఉన్న ప్రత్యేకత గురించి వివరించాల్సిన పనిలేదు. భారతీయులు దాన్ని ఒక పవిత్ర లోహంగా.. దైవ సంబంధ లోహంగా భావిస్తారు. ఇటువంటి ఈ లోహం గండకీ నదిలో వైశాఖ తదియ నాడు మొదటిసారి ఉద్భవించింది. విష్ణు అంశతో కూడిని లోహంగా బంగారం ప్రతీతి. అందుకే ఈ లోహం లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరం. ఈ రోజు ఎవరైతే ఈ లోహాన్ని భక్తిప్రపత్తులతో పూజిస్తారో వారికి ఏడాదంతా ఐశ్వర్యాలతో ఆరోగ్యాలతో ఉంటారనేది సనాతన నమ్మకం. కాబట్టే కోట్లాది మంది ప్రజలు ఈ రోజు భక్తితో గురివిందంత బంగారమైనా కొని దాన్ని దేవుని వద్ద పెట్టి అర్చించడం సాంప్రదాయంగా మారింది. ఒకవేళ బంగారం కొనే శక్తి లేకుంటే బంగారం తర్వాత దైవలోహంగా భావించే వెండిని కొనే సంప్రదాయంకూడా ఉంది. జ్యోతిషపరంగా, ఐశ్యర్యకారకుడైన శివునికి, స్థితికారకుడైన విష్ణువుకు ప్రత్యక్ష సంబంధం ఉన్న ఈ రోజున బంగారం తీసుకోవడం శుభప్రదం.

బంగారానికి హిరణ్మయి అని పేరు. విష్ణువు హిరణ్య గర్భుడు. అంటే గర్భం నందు బంగారం కలవాడు అని అర్థం. బంగారం విష్ణువుకు ప్రతిరూపంగా చెప్పవచ్చు. కాబట్టి బంగారం లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరంగా పండితులు వర్ణిస్తుంటారు. అదేవిధంగా లక్ష్మీసూక్తం అంటే శ్రీసూక్తంలో ‘హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణ రజతస్రజాం, చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ’ అని వర్ణిస్తుంది. అంతేకాకుండా విష్ణు సహస్రనామం ‘హిరణ్య గర్భో భూగర్భో మాధవో మధుసూదన’ అని పేర్కొంది. వీటన్నింటి ఆధారంగా లక్ష్మీకి, విష్ణువుకు సంబంధించిన బంగారాన్ని పూజించడం అన్ని విధాలా శ్రేయస్కరం అని పండితులు పేర్కొంటున్నారు.

అక్షయ తృతీయరోజు బంగారం కొంటే అక్షయంగా అంటే క్షీణించి పోకుండా ఐశ్వర్యం ఉంటుంది కాబట్టే అందరూ ఈ బంగారాన్ని కొంటారు. అంతేకాదు లౌకికంగా ఆలోచించినా బంగారం విలువైన లోహం. అవసరాలకు ఉపయోగపడే వస్తువు, అత్యవసరంగా ధనం కావాలంటే బంగారాన్ని అమ్ముకోవచ్చు లేదా తాకట్టు పెట్టుకుని ఆ పనిని పూర్తి చేసుకోవచ్చు. దైవికంగా, లౌకికంగా ముఖ్యమైనది బంగారం కాబట్టే సంవత్సరంలో ఏదో ఒకరోజు కొనే సంప్రదాయాన్ని పెద్దలు ఏర్పర్చారు. దీన్నివల్ల అందరూ ఈరోజుకోసం ఎంతోకొంత ధనాన్ని దాచి బంగారం కొనుకుంటారు. దీనివల్ల పొదుపు చేయడం అలవడుతుంది. పెద్దలు పెట్టిన ప్రతీ సంప్రదాయంలో ఏదో ఒక రహస్యం దాగి ఉందనడానికి అక్షయ తృతీయ ఒక నిదర్శనం.

Read more RELATED
Recommended to you

Exit mobile version