నారా లోకేశ్ కు ఓటమి భయం పట్టుకుందా?

-

రాష్ట్ర ముఖ్యమంత్రి అండ ఉన్నా… ఏంటి ప్రయోజనం. కనీసం ఒక అసెంబ్లీ నియోజకవర్గాన్ని గెలవలేకపోతున్నామని తెగ మదన పడుతున్నారు నారా లోకేశ్ అంటూ కథనాన్ని రాశారు.

తండ్రి దేశంలోనే అందరు రాజకీయ నాయకుల కన్నా సీనియర్. ప్రధాని మోదీ కన్నా కూడా. అని ఆయన అనుకుంటారు లేండి. ఏపీకి ముఖ్యమంత్రి. ఉమ్మడి ఏపీకి 9 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నారు. జాతీయ పార్టీ కాంగ్రెస్ లో కేంద్ర మంత్రి గానూ ఉన్నారు. అబ్బో.. ఆయన రాజకీయ చరిత్ర గురించి చెప్పుకోవాలంటే చాలా ఉంది. కానీ.. అధికారం చేతిలో ఉన్నా… తండ్రి ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్నా… చేతినిండా డబ్బు ఉన్నా… ఏం లాభం. సొంత కొడుకు నారా లోకేశ్ వారు మాత్రం కనీసం ఎమ్మెల్యే కూడా అవ్వలేకపోతున్నారు. అదే ఇప్పుడు ఏపీ సీఎం చంద్రబాబును బాధిస్తున్న అది పెద్ద అంశం.

అవును.. మొదటి సారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసిన లోకేశ్ బాబు.. ఖచ్చితంగా ఓడిపోతారట. ఎమ్మెల్యే అయ్యే చాన్సే లేదట. మంగళగిరి ప్రజలు లోకేశ్ ను అడ్డంగా ఓడించారట. అని చెప్పింది ఎవరో తెలుసా? దిన మలర్.. అనే తమిళ పేపర్. అవును.. ఆదిలోనే హంసపాదా? అంటూ తన పేపర్ లో ఓ కథనాన్ని ప్రచురించింది ఆ పేపరు.

రాష్ట్ర ముఖ్యమంత్రి అండ ఉన్నా… ఏంటి ప్రయోజనం. కనీసం ఒక అసెంబ్లీ నియోజకవర్గాన్ని గెలవలేకపోతున్నామని తెగ మదన పడుతున్నారు నారా లోకేశ్ అంటూ కథనాన్ని రాశారు. వారసత్వ రాజకీయాలను అనుసరిస్తూ ఏపీ సీఎం చంద్రబాబు.. తన కొడుకుకు పార్టీలో, ప్రభుత్వంలో చాలా ముఖ్యమైన బాధ్యతలు అప్పగించారని… మంత్రిగా కూడా నియమించారని పేర్కొంది.

ఇక ఈసారైనా ప్రత్యక్ష ఎన్నికల్లో నిలబెట్టకపోతే.. జనాలు తిడతారని… పోయి పోయి… వైఎస్సార్ కాంగ్రెస్ కు పట్టున్న ప్రాంతమైన మంగళగిరి నుంచి నిలబెట్టారు లోకేశ్ ను. అక్కడ గెలవడం అంత ఈజీ కాదు అనే విషయం ఎన్నికల ప్రచారం చేస్తుంటే లోకేశ్ బాబుకు అర్థమయింది. దీంతో తన తండ్రి అధికారాన్ని, డబ్బును, బలగాన్ని.. అన్ని రకాల అస్త్రాలు ప్రయోగించినా.. ప్రయోజనం లేకుండా పోయింది. ఓడిపోతా.. అనే భయం లోకేశ్ లో చేరిపోయింది.. అని ఆ పత్రిక ప్రచురించింది.

మొట్టమొదటిసారి పోటీ చేసిన ఎన్నికలు.. ఈ ఎన్నికల్లో ఓడిపోతే.. ఆదిలోనే హంసపాదు అనే ముద్ర నాకు పడిపోతుంది.. అనే భయంతో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు లోకేశ్.. అంటూ వ్యాఖ్యానించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version