తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియోజకవర్గం కొడంగల్ లో దారుణమైన పరిస్థితి నెలకొందని గులాబీ పార్టీ సోషల్ మీడియా వేదికగా.. సంచలన వీడియోను బయటపెట్టింది. అంబులెన్స్ లేక చనిపోయిన వ్యక్తిని తోపుడు బండి పై తరలించారని… ఒక వీడియో బయట పెట్టింది.

సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలోనే ఈ పరిస్థితి నెలకొందని గులాబీ పార్టీ ఫైర్ అవుతోంది. కొడంగల్ నియోజకవర్గ నారాయణపేట జిల్లా కోస్గి పట్టణంలో మొగిలయ్య అనే వ్యక్తి ద్విచక్ర వాహనంపై బస్టాండ్ వైపు వెళుతుండగా టిప్పర్ ఢీకొట్టింది. ఈ సంఘటనలో.. అతడు అక్కడికక్కడే మృతి చెందాడు.
ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు… అంబులెన్స్ లేకపోవడంతో ఆ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తోపుడు బండి పై తరలించారు. సంతలో నిమ్మకాయలు విక్రయించేందుకు వచ్చిన ఓ చిరు వ్యాపారికి చెందిన తోపుడు బండిని తీసుకొని వెళ్లారు. దీనిపై గులాబీ పార్టీ ఫైర్ అయింది. సీఎం రేవంత్ రెడ్డి నియోజకవర్గం లోని ఇలాంటి పరిస్థితులు నెలకొంటే.. మిగిలిన నియోజకవర్గాలలో… పరిస్థితి ఏంటని నిలదీస్తున్నారు గులాబీ నేతలు.
అంబులెన్స్ లేకపోవడంతో చనిపోయిన వ్యక్తి మృతదేహాన్ని తోపుడు బండిలో మోసిన పోలీసులు.
ఇది ఏదో పల్లెటూరి దుస్థితి కాదు… రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలోనే జరిగిన ఘోర అవమానం!కొడంగల్-నారాయణపేట జిల్లా కోస్గి పట్టణానికి చెందిన మొగులయ్య (28) ద్విచక్రవాహనంపై బస్టాండ్ వైపు వెళ్తుండగా… pic.twitter.com/Lm24uUkTLJ
— BRS Party (@BRSparty) August 18, 2025