వాస్తు: మీ ఇంటి ప్రధాన ద్వారం ఇటువైపు ఉంటే.. ఈ రంగులోనే ఉండాలి!

-

మీ ఇంటి ప్రధాన గేటు దక్షిణం వైపుగా ఉంటే వాస్తు (vasthu) ప్రకారం అది తప్పవుతుంది. అందుకు ఈ రంగు ఇంటి ప్రధాన ద్వారానికి వేసుకుంటే సరిపోతుంది. అది మెరూన్, పసుపు, సిందూరం రంగు వేసుకోవాలి. ఈ రోజు వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి ప్రధాన ద్వారం ఎటువైపు ఉంటే.. ఏ రంగు వేయించాలో తప్పకుండా తెలుసుకోండి. ఈ వాస్తు దోషాన్ని ఎలా నివారించాలో తెలుసుకుందాం. సాధారణంగా ఇళ్లు నిర్మించేటపుడు చాలా మంది వాస్తు నియమాలను పాటించరు. ఇంటి నిర్మాణంలో మెయిన్‌ గేట్‌ నిర్మాణం ప్రధానం. ఇష్టానుసారంగా నిర్మాణం చేపడితే ఆ ఇంటికి వాస్తు దోషాలు ఏర్పడుతాయి. ఆ ఇంట్లో ఉన్నవారికి అనేక సమస్యలు ఎదురవుతాయి.

 

వాస్తు | Vasthu

అయితే, ఇంటి దిశకు సంబంధించి కొన్ని నియమాలను సూచించారు వాస్తు శాస్త్ర నిపుణులు. వారు కొన్ని వాస్తు శాస్త్ర పరిష్కారాలను తెలిపారు. దీనివల్ల ఇంటికి వాస్తు దోషం ఉండదు. మీ ఇంటి నిర్మాణంలో ప్రధాన ద్వారం దక్షిణ దిశగా ఉంటే వాస్తు దోషం ఏర్పడుతుంది. అటువంటి ప్రధాన ద్వారానికి ఉన్న గేటుకు ప్రత్యేక రంగులు వేయాలి. అందులో మెరూన్, పేల్‌ యేల్లో, రెడ్‌ కలర్‌లకు ప్రాముఖ్యతను ఇవ్వాలి.

ఒకవేళ ఇంటి ప్రధాన ద్వారం ఉత్తరం వైపుగా ఉంటే అప్పుడు ప్రధాన ద్వారం పైభాగంలో 6 సమాంతరంగా ఉండే మెటల్‌ విండ్‌ను ఏర్పరుచుకుని, ప్రధాన ద్వారం పైభాగంలో మెటల్‌ చిమ్‌ను (చిరు గంటలు) ఏర్పాటు చేసుకోవాలి. గాలి వల్ల అవి అటూ ఇటూ ఊగుతూ శబ్దాన్ని చేస్తాయి. దీంతో వచ్చే ధ్వనులు ఇంట్లోకి నెగెటివిటీ రాకుండా చేస్తాయి. అందుకే ఎప్పడు ఇంటి నిర్మాణం చేపట్టినా వాస్తు ప్రకారం నిర్మాణం చేపట్టాలి. లేకపోతేం ఆ ఇంటికి వాస్తు దోషాలు ఏర్పడి, ఇంటిలోకి నెగెటివిటీ ప్రవేశించి, ఆ ఇంట్లో ఉన్నవారికి అనేక సమస్యలు వస్తాయి.

Read more RELATED
Recommended to you

Latest news