ధర్మ శాస్త్రం ప్రకారం.. భోజనం చేసేటప్పుడు చేయాల్సినవి చేయకూడనివి

-

ధర్మ శాస్త్రం ప్రకారం .. మన ఇంట్లో మీకు పని వత్తిడుల వల్ల వస్తున్నాను ఆగమని చెప్పి అన్నీ వడ్డించిన విస్తరి పళ్లెం ముందు కూర్చోరాదు, మనం కూర్చున్న తరువాతే అన్నీ వడ్డించుకుని భుజించాలి. ఎందుకంటే అన్నం కోసం మనం ఎదురుచూడాలి తప్ప మన కోసం అన్నం ఎదురుచూడరాదు. అలా చేస్తే రానున్నకాలంలో దరిద్రం పట్టుకునే అవకాశం ఎక్కువ. భోజనానికి ముందు శుబ్రంగా చేతులు, కాళ్లు కడుకొన్ని శుభ్రమైన దుస్తులతో భోజనం చేయాలి. కింద కూర్చుని తినడం శ్రేయస్కరం. అనారోగ్యవంతులు, కింద కూర్చునలేని వారు, వృద్ధులు, బాలింతల విషయంలో సడలింపు ఉంటుంది. మిగిలినవారు తప్పక కింద కూర్చుని తినాలి.

ఏ దిక్కున కూర్చుని భోజనం చేసినా మంచిదే… ఐతే తూర్పునకు ముఖం పెట్టి భోజనం చేయడం ఎక్కువ ప్రాముఖ్యం ఉంది, ఎందుంటే ఈ దిక్కువైపు తిరిగి భోజనం చేస్తే దీర్గాయుష్షు వస్తుంది. తూర్పు దిక్కు ఇంద్రునికి ఆధిపత్య స్థానము, సూర్యునికి నివాస స్థానం ఉండటం వలన ప్రాధాన్యమెక్కువ. పడమర ముఖంగా కూర్చుంటే … బలం వస్తుంది. ఉత్తర ముఖంగా కూర్చుంటే సంపద వస్తుంది. దక్షిణ ముఖంగా కూర్చుంటే కీర్తి వస్తుంది.

ఆచరించవలసిన నియమాలు

అన్నము తింటున్నప్పుడు అన్నమును మరియు ఆ అన్నము పెట్టేవారిని తిట్టటం చేయరాదు. ఏడుస్తూ తింటూ గిన్నె ఆకు మొత్తం ఊడ్చుకొని తినడం పనికిరాదు, దెప్పి పొడువరాదు. ఎట్టిపరిస్థితిలోనైనా ఒడిలో కంచం, పళ్ళెము పెట్టుకుని అన్నం తినరాదు, ఇది చాలా దరిద్రము. భోజనసమయంలో నవ్వులాట, తగువులాట, తిట్టుకొనుట, గేలిచేయుట నష్టదాయకం. భోజనానంతరము ఎంగిలి ఆకులు, కంచాలు ఎత్తేవాడికి వచ్చే పుణ్యం, అన్నదాతకు కూడా రాదు. కాబట్టి ఇప్పటి నుంచి అన్నం తినే సమయంలో పెద్దలు చెప్పిన జాగ్రత్తలు తీసుకుని ఆరోగ్యంగా ఆనందంగా ఉండండి.

– శ్రీ

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version