వాస్తు: ఏకాగ్రత పెరగాలంటే ఇలా చెయ్యండి…!

ఏకాగ్రత తక్కువగా ఉండే వాళ్ళు బాధ పడకుండా ఈ వాస్తు చిట్కాలను పాటిస్తే మంచిది. పండితులు ఈ రోజు ఎన్నో ముఖ్యమైన విషయాలను మనతో షేర్ చేసుకోవడం జరిగింది. కాబట్టి ఏకాగ్రత పెరగడానికి ఈ విధంగా ఫాలో అయిపోతే మార్పు మీరే గమనించొచ్చు. ముఖ్యంగా పిల్లల్లో ఏకాగ్రత పెరగాలంటే ఇవి బాగా ఉపయోగపడతాయి అని పండితులు అంటున్నారు. చాలా మంది పిల్లలు ఎంతగానో శ్రమిస్తారు, పరీక్షల్లో మంచి మార్కులు రావాలని ఎల్లప్పుడూ చదువుతూ ఉంటారు.

కానీ తక్కువ జ్ఞాపకశక్తి ఉండడం, ఏకాగ్రత తగ్గడం జరుగుతుంది. అటువంటి వాళ్ళు ఈ టిప్స్ ని ఫాలో అయితే చాలా మేలు కలుగుతుంది. పిల్లల ఏకాగ్రత పెట్టాలన్నా… జ్ఞాపక శక్తి పెరగాలన్నా వాస్తు బాగా ఎఫెక్ట్ చేస్తుంది. ఎప్పుడూ కూడా పిల్లలు చదువుకునే గదిలో వెలుతురు బాగా ఉండాలి అలానే నెగిటివ్ వైబ్రేషన్స్ రాకుండా గది ఉండాలి.

సన్ లైట్ లేదా సహజమైన లైట్ పడేటట్టు ఉండాలి. అలానే చదువుకునేటప్పుడు తూర్పు వైపు కూర్చుని చదువుకుంటే కాన్సంట్రేషన్ పెరుగుతుంది. అలానే వాళ్ళు ఉండే గది లో అనవసరమైన సామాన్లని ఉంచకూడదు. అలానే చదువుకునే టేబుల్ మొదలైన ఫర్నిచర్ అన్ని కూడా గుండ్రంగా లేకుండా చూడండి.

గుండ్రంగా ఉంటే వాళ్ళలో గజిబిజి పెరుగుతుంది. ఎప్పుడూ కూడా వాళ్ళ యొక్క స్టడీ టేబుల్ తూర్పు లేదా ఉత్తరం వైపు ఉండేటట్లు చూసుకోండి. ఇలా ఈ తప్పులు చేయకుండా ఉంటే ఏకాగ్రత పెరుగుతుంది. అలానే వాళ్ళ యొక్క అకడమిక్స్ లో కూడా మంచి ఫలితాలు మీరు గమనించవచ్చు.