వాస్తు: వ్యాపారం అభివృద్ధి చెందాలంటే ఈ తప్పులు చెయ్యద్దు..!

వాస్తు పండితులు ఈ రోజు మన కోసం కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పారు. వీటిని కనుక అనుసరిస్తే వ్యాపారంలో లాభాలు కలుగుతాయి. చాలా మంది వ్యాపారంలో నష్టాలు కలుగుతున్నాయని ఇబ్బంది పడుతూ ఉంటారు.

 

అటువంటి వాళ్ళు ఈ వాస్తు టిప్స్ ని పాటిస్తే మంచి కలుగుతుంది. దీంతో బిజినెస్ లో లాభం ఉంటుంది. ఆగ్నేయం వైపున ఎరుపు రంగు ఉండడం మంచిది కాదని పండితులు అంటున్నారు. కాబట్టి పెయింట్లు వేసుకునేటప్పుడు దీనిని మరిచిపోవద్దు.

ఎరుపు రంగు ఇంట్లో ఉండే ఒక గోడకి వేసుకోవడం మంచిది కాదని చెబుతున్నారు. ఇలా ఇంట్లో ఎరుపు రంగును గోడకు వేయడం వల్ల బిజినెస్ అభివృద్ధి చెందకుండా ఉంటుందని.. వ్యాపార సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు.

అదే విధంగా వాళ్లకి కూతురు ఉన్నట్లయితే పెద్ద కూతురికి సమస్యలు వస్తాయని చెప్పడం జరిగింది. కాబట్టి ఎప్పుడూ కూడా ఇంట్లో ఒక గోడకి ఎరుపు రంగు వేయించుకోవడం మంచిది కాదు కాబట్టి ఈ తప్పులు చేయకుండా ఉంటే వ్యాపారం కూడా బాగుంటుంది అలాగే ఆరోగ్యంగా ఆనందంగా ఉండడానికి కూడా వీలవుతుంది.