భార్య భర్తల మధ్య గొడవలు రాకుండా ఉండాలంటే వీటిని అనుసరించండి..!

ఎంత ప్రశాంతంగా ఉందామని అనుకున్నాసరే కొందరి ఇళ్ళల్లో భార్య భర్తల మధ్య గొడవలు వస్తూనే ఉంటాయి. నిజంగా వీటికీ అస్సలు ఫుల్స్టాప్ అంటూ ఉండదు. ప్రతి రోజూ ఏదో ఒక చిన్న దానికి కూడా గొడవలు వస్తూనే ఉంటాయి.

Husband and Wife Fight | భార్య భర్తల మధ్య గొడవలు
Husband and Wife Fight | భార్య భర్తల మధ్య గొడవలు

 

మీరు కూడా మీ పార్టనర్ తో ఎక్కువగా గొడవ పడుతున్నారా..? వాటిని ఆపాలని ప్రయత్నాలు చేస్తున్నారా..? అయితే తప్పకుండా పండితులు చెబుతున్న ఈ చిట్కాలు ఫాలో అవ్వండి.

వీటిని కనుక అనుసరించారు అంటే తప్పకుండా మీ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. వాస్తు దోషాలు పూర్తిగా తొలగిపోతాయని పండితులు చెప్తున్నారు. మరి ఆలస్యం ఎందుకు వాటి కోసం మనం ఇప్పుడే తెలుసుకుందాం.

పండితులు చెబుతున్న ఈ చిట్కాలను కనుక పాటించారంటే తప్పకుండా మీ ఇంట్లో నుండి గొడవలు పూర్తిగా దూరం అయిపోతాయి. దీనితో మీ భార్యాభర్తలిద్దరూ కూడా ఆనందంగా ఉండొచ్చు. ఇక టిప్స్ గురించి చూస్తే..

ఇల్లు శుభ్రం చేసేటప్పుడు ఉప్పును వాడండి:

మామూలుగా ఇల్లు కడిగేటప్పుడు కొద్దిగా ఉప్పు జల్లి తుడిచేయండి. ఉప్పు నెగిటివ్ ఎనర్జీని పూర్తిగా దూరం చేస్తుంది. దీనితో గొడవలు ఉండవు. ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరిగి ఆనందంగా ఉండడానికి సహాయపడుతుంది.

హారతి కర్పూరం:

ప్రతిరోజు ఉదయం సాయంత్రం హారతి కర్పూరం వెలిగించి ఇల్లంతా చూపించండి. దీనితో పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. నెగిటివిటీ పూర్తిగా దూరమైపోవడం వల్ల ఇంట్లో గొడవలు వుండవు.

పసుపు:

ఏడుదారాలని తీసుకుని వాటికి పసుపు రాసి కుడి చేత్తో పట్టుకుని ”ఓం నమో భగవతే వాసుదేవాయ నమః” అని ఏడు సార్లు చదవండి. ఆ తర్వాత ఆ దారాలని ఎర్రటి గుడ్డలో కట్టేసి మీ బెడ్ రూమ్ లో ఎవరు చూడని ప్రదేశం లో ఉంచండి. ఇలా చేయడం వల్ల భార్య భర్తల మధ్య గొడవలు పూర్తిగా దూరం అయిపోతాయి అని పండితులు చెప్తున్నారు.