వాస్తు : ఉప్పు, లవంగాల పరిహారం.. మీ ఇంటికి ధనలాభం!

వాస్తు నియమాలను పాటించి మనం ఇంట్లో సుఖసంతోషాలతో మెలగాలని ఎన్నో ఉపాయాలను చేస్తాం. దీంతో మన ఇళ్లలోని నెగెటీవ్‌ ఎనర్జీ తొలగి.. పాజిటివ్‌ ఎనర్జీ ప్రవేశిస్తుంది. తద్వారా ఇంట్లో ఏదైనా ధనానికి లోటు ఉంటే… మీ ఇంటికి ధనలాభం కలుగుతుంది. ఆ ఇంట్లోవారు ధనంతోపాటు సంపదలు పెరుగుతాయి. వాస్తుశాస్త్ర నిపుణులు దీనికి ఓ పరిహారాన్ని సూచిస్తున్నారు. అది కూడా మన వంటింట్లో ఎల్లప్పుడూ అందుబాటులో ఉండే వస్తువులతోనే ఈ పరిహారం చేసుకోవచ్చు.

దీనికి కొద్దిగా ఉప్పు, నాలుగైదు లవంగాలను ఓ గ్లాస్‌ బౌల్‌లో లేదా మామూలు బౌల్‌లో తీసుకోవాలి. దీన్ని ఇంట్లోని ఏదో ఒక మూలలో పెట్టాలి. ఈ పరిహారం చేయడం వల్ల ఇంట్లోకి ధనం రావడంతోపాటు, సుఖసౌభాగ్యాలు కలుగుతాయి. గాజు గ్లాసులో ఉప్పును పెట్టడం ద్వారా మనీ షార్టేజీ ఉన్నవారికి ధనలాభం చేకూరుస్తుంది. అంతేకాదు, ఈ పరిహారంతో ఇంట్లో ఓ మంచి అరోమా కలిగిన సువాసన వెదజల్లుతుంది. ఆ ఇంట్లో ఉండేవారు సుఖసంతోషాలతో మెలగుతారు. బాత్‌రూంకు సంబంధించిన వాస్తు దోషాలకు కూడా ఏవైనా ఉంటే… కల్లు ఉప్పును ఓ బౌల్‌లో వాష్‌రూం ఏదో మూలలో పెట్టాలి. అది ఎవరూ టచ్‌ చేయకుండా ఉండే ప్రాంతంలో పెట్టాలి. అందులో ఉండే ఉప్పును కొన్ని రోజుల తర్వాత మారుస్తూ ఉండాలి.