వాస్తు: మేడ మీద పాత సామాన్లని పెడితే సమస్యలు తప్పవు..!

మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నారా..? తరచు మీకు ఏదో ఒక ఇబ్బంది వస్తోందా..?అయితే తప్పకుండా మీరు వాస్తు పండితులు చెబుతున్న ఈ అద్భుతమైన చిట్కాల గురించి తెలుసుకోవాలి. మరి ఇక ఆలస్యం ఎందుకు దీనికోసం ఇప్పుడే పూర్తిగా చూసేద్దాం.

 

vasthu

వాస్తు పండితులు చెబుతున్న ఈ అద్భుతమైన చిట్కాలను కనుక ఫాలో అయ్యారంటే కచ్చితంగా సమస్యల నుండి బయట పడవచ్చు. సాధారణంగా మెడ మీద మరియు ఇంటి పైకప్పు మీద పాత సామాన్లుని పెట్టడం చాలా మందికి అలవాటు.

అయితే నిజంగా ఇలా పెట్టడం వల్ల అస్సలు మంచిది కాదని పండితులు అంటున్నారు. దీని వల్ల ఎలాంటి ప్రభావం పడుతుంది అనే విషయంలోకి వస్తే… ఇంటి మేడ మీద మరియు పైకప్పు మీద ఇలా పనికి రాని సామాన్లని పెడుతూ ఉండటం వల్ల నెగిటివ్ ఎనర్జీ ఉంటుందని.. అదే విధంగా ఎన్నో సమస్యలు తీసుకు రావడానికి ఇది కారణం అవుతుందని.. పితృ దోషం కూడా కలుగుతుందని పండితులు అంటున్నారు.

ఇలా ఇంట్లో ప్రతీ దానిపై కూడా నెగెటివ్ ప్రభావం పడుతుందని కనుక పనికిరాని సామాన్లని వుంచద్దు అని అంటున్నారు పండితులు. వీటి వలన నెగిటివ్ ఎనర్జీ ఉంటుందని సమస్యలు తప్పవని అంటున్నారు కాబట్టి ఈ తప్పులు చేయకుండా చూసుకోండి. ఒకవేళ కనుక ఈ తప్పులు మీరు సరిచేసుకుంటే ఇబ్బందులు లేకుండా ఉండొచ్చు అని తెలుసుకోండి.