వాస్తు: నెగటివిటీని దూరం చేసుకోవాలంటే ఇలా చెయ్యండి..!

ఇబ్బందులన్నీ పోయి ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలంటే వాస్తు పండితులు చెబుతున్న ఈ చిట్కాలను పాటిస్తే మంచిది. ఇంట్లో అందరూ సఖ్యంగా ఉండాలన్నా.. నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా దూరమైపోవాలన్న పండితులు చెబుతున్న ఈ చిట్కాలను పాటిస్తే మంచిది. ముఖ ద్వారం దగ్గర ఈ మార్పులు చేశారంటే కచ్చితంగా నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా దూరమైపోయి పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. అయితే మరి ఇక ఆలస్యం ఎందుకు వాటి కోసం మనం ఇప్పుడే పూర్తిగా చూసేద్దాం.

 

vasthu for main door

ఉత్తర ద్వారం ఉంటే కచ్చితంగా మంచి ఫలితాలు పొందవచ్చునని పండితులు అంటున్నారు. మంచి అవకాశాలుని విజయాలని ఉత్తర ద్వారం వల్ల పొందవచ్చని చెబుతున్నారు. అదే విధంగా ప్రతి రోజు గుమ్మం దగ్గర పూలని పెట్టడం వల్ల మంచి జరుగుతుందని అంటున్నారు. ఎప్పుడూ కూడా ముఖద్వారం ఎంతో ఆకర్షణీయంగా కనపడుతూ ఉండాలి.

అలా ఉండడం వల్ల చెడు జరగకుండా మంచి జరుగుతుందని అంటున్నారు. ఇంట్లో రిలేషన్షిప్ బాగుండాలంటే తూర్పు వైపు ఎంట్రెన్స్ ఉండేటట్లు చూసుకోవడం వల్ల కూడా మంచి ఫలితాలు కనిపిస్తాయి. అలాగే ఇప్పటి కాలంలో చాలా మంది రెండు తలుపులని ఉపయోగిస్తున్నారు. ఫస్ట్ డోర్ బయటికి తెరుచుకునేలా ఓపెన్ చేయడం వల్ల నెగిటివిటీ పూర్తిగా దూరం అవుతుంది. ఇలాంటి మార్పులు చేసుకుంటే పాజిటివిటీ వుంది నెగిటివిటీ పూర్తిగా దూరం అయిపోతుంది.