వాస్తు: ఆరోగ్యం, ధనం ఉండాలంటే ఈ తప్పులు చెయ్యద్దు..!

వాస్తు (Vasthu Tips) పండితులు వాస్తు కి సంబంధించిన కొన్ని విషయాలు చెప్పారు. వాటి కోసం ఇప్పుడు చూద్దాం..! ధనం, ఆరోగ్యం, ఆనందం, శాంతి ఇంట్లో ఉండాలంటే ఈ తప్పులు చేయకండి. ఇంట్లో ఉండే దేవుడు, దేవతల ఫోటోలు వల్ల పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. కాబట్టి ఎప్పుడైనా పగిలి పోయిన లేదా విరిగి పోయిన దేవుడు బొమ్మలు లేదా విగ్రహాలు ఇంట్లో ఉపయోగించవద్దు.

దీని వల్ల నెగిటివ్ ఎనర్జీ వస్తుంది అని గుర్తుంచుకోండి. అదే విధంగా పని చేయని గడియారాలు ఇంట్లో ఉంచుకోండి. పని చేయని గడియారాలు కారణంగా నెగిటివ్ ఎనర్జీ వస్తుంది. దీనితో ఆనందంగా ఉండలేరు.

తెగిపోయిన చెప్పులు వంటివి కూడా ఇంటి నుంచి తొలగించడం మంచిది. వీటి వల్ల కూడా ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది. ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలంటే ఇటువంటి వాటిని ఇంట్లో నుండి దూరంగా ఉంచడం మంచిది.

అలానే చిరిగిపోయిన బట్టలని కూడా ఇంట్లో పెట్టుకోవడం మంచిది కాదు. ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలంటే వీటిని తొలగించడం మంచిది. దీనితో మీ ఇంట్లో లక్ష్మీదేవి కూడా ఉంటుందని గుర్తుపెట్టుకోండి.