మీ ఊపిరితిత్తులు ఎంత ఆరోగ్యంగా ఉన్నాయో ఇలా చెక్ చేసుకోండి..!

-

కరోనా వైరస్ సెకండ్ వేవ్ కారణంగా చాలా మంది అనారోగ్యంతో సతమతమవుతున్నారు. మరి కొందరు అయితే కరోనా కారణంగా మృతి చెందారు. కరోనా వైరస్ వల్ల తీవ్రంగా ఊపిరితిత్తులపై ప్రభావం చూపుతోంది. దీని కారణంగా వ్యాధి బారిన పడిన వాళ్ళకి శ్వాస సంబంధిత సమస్యలు కూడా వస్తున్నాయి. డాక్టర్లు ఈ మ్యుటెంట్ చాలా ప్రమాదకరం అని కూడా చెప్పడం జరిగింది. ఇది మొదట గొంతు లో మొదలై తర్వాత తీవ్ర సమస్యలకు దారి తీస్తుంది.

ఇటువంటి సమయం లో రోగ నిరోధక శక్తి చాలా ముఖ్యం. రోగ నిరోధక శక్తి కనుక లేకపోతే డైరెక్ట్ గా ఊపిరితిత్తులపై తీవ్ర ప్రభావం పడుతుంది. కరోనా వైరస్ పాజిటివ్ వచ్చిన ఐదు నుండి ఆరు రోజులకు ఊపిరితిత్తుల పై ఎఫెక్ట్ ఉంటుంది. మీ ఊపిరితిత్తులు ఎంత ఆరోగ్యంగా ఉన్నాయో తప్పక ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి.

మామూలుగా అయితే ఊపిరితిత్తులు ఎలా ఉన్నాయి అది చెక్ చేసుకోవడానికి ఎక్స్రే ఉపయోగపడుతుంది. కానీ ఇక్కడ ఇంట్లో ఉండే ఊపిరితిత్తులు ఎలా ఉన్నాయో చెక్ చేసుకోవడానికి ఇప్పుడు చెప్పడం జరిగింది.

మంచి ఆసుపత్రి నుంచి ఒక టెస్టింగ్ వీడియో కూడా విడుదల చేశారు. ఈ వీడియో ద్వారా మీరు వేగంగా మరియు సులభంగా మీ ఊపిరితిత్తులు ఎలా ఉన్నాయి అనేది తెలుసుకోవచ్చు. మీ ఊపిరితిత్తులు ఆరోగ్యంగా గురించి ఇలా తెలుసుకోండి…zydus హాస్పిటల్ నుండి ఈ వీడియో విడుదల అయింది.

0 నుండి పది అంకెలు ఇచ్చారు. దీనిలో రెండవ అంకె ఊపిరితిత్తులు నార్మల్గా ఉన్నాయని సూచిస్తుంది. 5వ అంకె ధృడంగా ఉన్నాయని సూచిస్తుంది. ఊపిరితిత్తులు బాగా ఆరోగ్యంగా ఉంటే పదవ అంకె సూచిస్తుంది. దీనికోసం మీరు వీడియోని ప్లే చేసి మీ శ్వాసని హోల్డ్ లో ఉంచాలి అక్కడ ఉండే రెడ్ బాల్ స్పిన్నింగ్ ని చూడాలి.

రెడ్ కలర్ బాల్ ఎన్ని సార్లు అయితే తిరుగుతుందో అని అంకెలు మీరు ఇచ్చుకోవాలి. అయితే మీ శ్వాస హోల్డ్ లో ఉన్నప్పుడు మాత్రమే మీరు అంకెలని ఇవ్వాలి. మీరు శ్వాస ఎప్పుడైతే వదిలేస్తారో అప్పుడు వీడియో ని ప్లే చేయకూడదు. ఆ తర్వాత మీరు పాయింట్లు లెక్క పెట్టుకోవాలి ఎంతసేపు అయితే మీరు శ్వాస తీసుకోకుండా ఉంటారో అంత దృఢంగా మీ ఊపిరితిత్తులు ఉన్నట్లు.

Read more RELATED
Recommended to you

Latest news