వాస్తు: మీ వ్యాపారం బాగుండాలంటే ఇలా చెయ్యండి..!

Join Our Community
follow manalokam on social media

సాధారణంగా చాలా మంది ఇళ్లల్లో మనం ఈ ఏడు గుర్రాల పిక్చర్ ని తగిలించడం చూస్తూ ఉంటాం. అయితే వాటిని పెట్టడం వల్ల తరచు గొడవలు అవుతాయని లేదా ఇబ్బందులు కలుగుతాయి అని అంటూ ఉంటారు. అయితే ఈ ఏడు గుర్రాలుని మనం ఇంట్లో ఉంచుకోవచ్చా..?, ఒకవేళ పెడితే ఎటువంటి ఫలితం ఉంటుంది అనేది ఈ రోజు తెలుసుకుందాం.

వాస్తు శాస్త్రం ప్రకారం ప్రతి దిక్కుకి కూడా ప్రాముఖ్యత ఉంది. అయితే ఈ ఏడు గుర్రాలని ఎందుకు పెట్టుకుంటారు..?, అసలు దీనికి సంకేతం ఏమిటి అనేది మీకు తెలుసా..? వాస్తు శాస్త్రం ప్రకారం ఇది చాలా మంచి కలిగించేది. గుర్రాలు పరిగెట్టడం కలిగిన ఈ పిక్చర్ ని ఇంట్లో ఉంచుకోవడం వల్ల ఎదుగుదల మరియు పవర్ ఉంటుందని అంటారు.

అలాగే ఏడు సమాఖ్య కూడా ఎంతో మంచిది. ముఖ్యంగా దీనిని వ్యాపారం చేసే ప్రదేశాల్లో పెట్టుకుంటే మరింత మంచి కలుగుతుంది. అలానే వ్యాపారం లో లాభాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం దీనిని ఏ దిక్కులో ఉంచుకోవాలని కూడా చూసేద్దాం..!

మీరు వ్యాపారం చేసే చోట దీనిని పెట్టుకోవాలంటే క్యాబిన్ దగ్గర పెట్టుకోవడం మంచిది అవి లోపలికి వస్తున్నట్లుగా మీరు తగిలిస్తే మంచిది. దీని వల్ల నీకు ధన నష్టం కానీ డబ్బులు రాక పోవడం లాంటివి కానీ జరగవు. ఎప్పుడూ కూడా ఆదాయం బాగుంటుంది. తూర్పు దిక్కున ఉంచుకుంటే మరెంత మంచి కలుగుతుంది.

ఇది వర్క్ ని మరింత అభివృద్ధి చేస్తుంది. అదే ఒకవేళ మీరు ఇంట్లో కనుక దీనిని పెట్టుకుంటే కోపంగా ఉన్న గుర్రాలను మాత్రం పెట్టొద్దు. ముఖంలో ఆనందం ఉండే వాటిని మాత్రమే పెట్టండి అలా అని ఎక్కడా కూడా చిరిగిపోకుండా వుండే దానిని చూసి పెట్టండి. ఓకే గుర్రం ఉన్న ఫోటోని తగిలించవద్దు. ఇది నెగిటివ్ ఎనర్జీని తీసుకొస్తుంది.

TOP STORIES

రంజాన్ నెల ప్రారంభం.. విశేషాలు.. ప్రాముఖ్యత.. కొటేషన్లు..

రంజాన్ నెల ప్రారంభమైంది. ఈ సంవత్సరం ఏప్రిల 14వ తేదీ నుండి మే 12వరకు రంజాన్ నెల ఉంటుంది. పవిత్రమాసమైన ఈ నెలలో ముస్లింలందరూ భక్తిశ్రద్ధలతో...