‘వకీల్ సాబ్’ వచ్చేశాడు.. అభిమానుల్లో సందడే సందడి..!

Join Our Community
follow manalokam on social media

పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘వకీల్‌సాబ్’ సినిమా ఉదయం 4 గంటల నుంచే పలు థియేటర్లలో రిలీజ్ అయింది. పొలిటికల్ ఎంట్రీ తర్వాత సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్‌ను చూసేందుకు ప్రేక్షకులు అర్ధరాత్రి నుంచే థియేటర్ల ముందు గుమిగూడారు. దాదాపు ఇప్పటికే పలు థియేటర్ల ముందు అభిమానులు చేరుకుని సంబరాలు చేసుకుంటున్నారు. మూడేళ్ల తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల్లో నటించడంతో అభిమానుల్లో పండుగ వాతావరణం నెలకొంది.

వకీల్ సాబ్ - పవన్ కళ్యాణ్
వకీల్ సాబ్ – పవన్ కళ్యాణ్

వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా బాలీవుడ్ మూవీ ‘పింక్’ సినిమాకు రీమేక్ అని అందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమా దర్శకుడు వేణు శ్రీరామ్ తన వెర్షన్‌లో చిత్రీకరించడం, అలాగే పవన్ రీఎంట్రీ ఇవ్వడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పటికే అభిమానులు థియేటర్ల ముందు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కటౌట్స్ పెట్టి పాలాభిషేకాలు చేస్తున్నారు. విదేశాల్లోనూ పవన్ కళ్యాణ్ మ్యానియా కనిపిస్తోంది. అయితే ఇప్పటికే పవన్ కళ్యాణ్ అభిమానులు థియేటర్ల ముందు గుమిగూడారు. కొన్ని చోట్లల్లో అర్థరాత్రి నుంచే గందరగోళ వాతావరణం నెలకొంది. తిరుపతిలోని శాంతి థియేటర్‌లో బెనిఫిట్ షో నిర్వహించడం లేదని అభిమానులు రాళ్లతో దాడికి దిగారు. దీంతో అక్కడ స్వల్ప ఉద్రిక్తత నెలకొంది.

మూడేళ్ల గ్యాప్ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వెండితెరపై కనిపిస్తున్నారు. దీంతో పవన్ కళ్యాణ్ అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. ఈ మేరకు విదేశాల్లో రిలీజైన వకీల్‌సాబ్ సినిమాపై పాజిటివ్‌ రెస్పాన్స్ వస్తోంది. ఇప్పటికే ట్విట్టర్‌లో సినిమాపై అంచనాలు పెంచే విధంగా ట్విట్లు వస్తున్నారు. ఫస్టాప్ డీసెంట్‌గా ఉందని, సెకండాఫ్ ఎక్సలెంట్‌గా ఉందంటూ ట్విట్లు చేస్తున్నారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ యాక్షన్ సీన్లు, డైలాగ్ డెలివరీ మునుపటి సినిమాల కంటే చాలా కొత్తగా ఉందంటున్నారు. ఈ సారి కెమెరా ముందు తన నట విశ్వరూపాన్ని చూపించారని సమాచారం. దర్శకుడు వేణు శ్రీరామ్ కథను నేరేట్ చేసిన విధానం అద్భుతంగా ఉందనే వార్తలు వినిపిస్తున్నారు.

సినిమా ఫస్టాప్ కొంచెం స్లోగా నడుస్తుండగా.. ఇంటర్వెల్ తర్వాత ప్రేక్షకులు సినిమాలో ఇన్వాల్వ్ చేయడంలో దర్శకుడు వేణు శ్రీరామ్ సక్సెస్ అయ్యారు. థమన్ మ్యూజిక్, బ్యాంక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాను ప్రాణం పోసిందని టాక్. వకీల్ సాబ్ సినిమా పవన్ కళ్యాణ్ కెరీర్‌లోనే బెస్ట్ పర్ఫర్మెన్స్ ఇచ్చారని టాక్ రావడం విశేషం.

TOP STORIES

శ్రీరామనవమి స్పెషల్: పానకం, వడపప్పు ప్రసాదం ఇలా ఈజీగా చేసేయండి…!

శ్రీ రామ నవమి అంటే హిందువులకు ఎంతో ముఖ్యమైన రోజు. ఆ రోజున ఇళ్ళల్లో, దేవాలయాల్లో కూడా శ్రీ రామునికి ఘనంగా పూజలు నిర్వహిస్తారు. ఉదయాన్నే...