వాస్తు: ఈ మూడు పిక్చర్స్ ని ఇంట్లో ఉంచుకోకూడదు తెలుసా..?

-

వాస్తు పండితులు కొన్ని ముఖ్యమైన విషయాలు మనతో పంచుకున్నారు. వాటిని చూశారు అంటే మీకు ఎన్నో విషయాలు తెలుస్తాయి. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో పులి, సింహం వంటి వాటిని పెట్టుకోకూడదు. వేటాడుతున్న జంతువుల్ని పెట్టుకోవడం వల్ల నెగిటివిటీ కలుగుతుందని.. ఆ ఇంట్లో పాజిటివిటీ ఉండదని పండితులు చెబుతున్నారు.

అదే విధంగా ఇంట్లో గొడవలు ఎక్కువగా వస్తాయని.. ఒకరంటే ఒకరికి ద్వేషం కలుగుతుందని చెప్పారు. అలానే ఈ ఫోటోలని అస్సలు పెట్టుకోవద్దు.

మునిగిపోతున్న షిప్:

చాలా మంది టైటానిక్ షిప్ లాంటి వాటిని ఇష్టపడుతూ ఉంటారు. కానీ అటువంటి పిక్చర్స్ పెట్టుకోవడం వల్ల దురదృష్టం కలుగుతుందని.. ఇంట్లో ఆర్థిక సమస్యలు కూడా వస్తాయని పండితులు చెబుతున్నారు.

నటరాజుని పిక్చర్:

ఇంట్లో నటరాజ స్వామి బొమ్మ లేదా పిక్చర్ ని పెట్టుకోవడం మంచిది కాదట. దీని వల్ల కూడా నెగిటివిటీ కలుగుతుందని పండితులు అంటున్నారు.

మహాభారతంలోని బొమ్మలు:

మహాభారతంలో కౌరవులు కుటుంబం నాశనమైపోతుంది అందుకని మహాభారతానికి సంబంధించిన ఏమైనా ఫోటోలు పెట్టడం వల్ల కుటుంబంలో సమస్యలు వస్తాయని.. యుద్ధానికి సంబంధించిన వంటి వాటిని కూడా ఇంట్లో పెట్టకూడదు అని పండితులు చెప్పడం జరిగింది. వీటిని కనుక దూరంగా ఉంచితే ఇటువంటి సమస్యలు రావు.

Read more RELATED
Recommended to you

Latest news