శరీరానికి పాలు మంచి పోషకాహారం. కానీ అవి కూర్చుని తాగితే దాని ప్రయోజనాలు శరీరానికి అందవన్న సంగతి మీకు తెలుసా? అవును, మీరు వింటున్నది నిజమే. నీళ్ళు కూర్చుని తాగాలి. పాలు నిలబడి తాగాలి. లేదంటే పాలలోని పోషకాలు శరీరానికి సరిగ్గా అందవు. ఇప్పటివరకూ కూర్చుని పాలు తాగే అలవాటు ఉంటే వెంటనే మార్చుకోండి. నిలబడి తాగడం వలన ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసుకోండి.
ఆయుర్వేదం ప్రకారం కూర్చుని పాలు తాగడం వలన జీర్ణ సంబంధ సమస్యలు వస్తుంటాయి. కూర్చుని తాగడం వల్ల జీర్ణ సంబంధ ఇబ్బందులు తలెత్తుతాయని, వాత కఫ, పిత్త దోషాలు కలిగే అవకాశం ఉందని అంటున్నారు. అందుకే నిలబడి పాలు తాగడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
నిలబడి పాలు తాగడం వలన మోకాళ్ళు క్షీణించవు. కండరాలు బలంగా తయారవుతాయి. ఇవి కాకుండా గుండెజబ్బులు, అధిక బీపీ వంటి సమస్యలు తగ్గుతాయి. ఇంకా కళ్ళు, చర్మ సంరక్షణకి ఇవి చాలా మేలు చేస్తాయి.
రాత్రి పాలు తాగే అలవాటు ఉన్నవారు పడుకునే అరగంట ముందు తాగాలి. అందులో చక్కెర వేసుకోకుండా బెల్లం ఉపయోగించండి. ఇంకా ఆవు నెయ్యి మరింత ప్రయోజనకరంగా ఉంటుంది.
ప్యాకెట్లలో లభించే పాలు కాకుండా తాజా పాలు ఆరోగ్యానికి చాలా మంచివి. మీకు అందుబాటులో ఉంటే తాజా పాలనే వాడండి. ఎప్పుడూ పాలు తాగినా వాటిని మరగబెట్టడం మర్చిపోవద్దు. కావాలంటే కొద్దిగా నీళ్ళు కలపండి. దానివల్ల పాలు త్వరగా జీర్ణం అవుతాయి. పాలను ఇతర ఆహార పదార్థాలతో కలిపి తీసుకూడదు. విడిగానే తాగాలి. అప్పుడే సరిగ్గా జీర్ణం అవుతాయి.