వాస్తు: ఆనందంగా ఉండాలంటే ఈ టిప్స్ ని అనుసరించండి..!

-

ఈరోజు వాస్తు పండితులు కొన్ని వాస్తు టిప్స్ మనతో షేర్ చేసుకున్నారు. వాటిని చూస్తే ఆనందంగా ఉండటానికి కొన్ని పరిష్కారాలు దొరుకుతాయి. మరి ఆలస్యమెందుకు వాటి కోసం కూడా తెలుసుకుందాం.

మొక్కలు ఉంచడం:

ఇంట్లో మొక్కలు ఉండడం వల్ల మానసిక ఆరోగ్యం బాగుంటుంది. అదే విధంగా వాస్తు ప్రకారం కూడా అది పాజిటివిటీని ఇవ్వడానికి సహాయ పడుతుంది. ఇంట్లో తులసి మొక్క, మనీ ప్లాంట్, కలబంద మొక్కలు పెంచడం చాలా మంచిది. దీని వల్ల వాస్తు దోషాలు పోతాయి. అదే విధంగా ఇంట్లో పాజిటివిటీ కూడా ఉంటుంది.

మంచి నీళ్లని వృధా చేయొద్దు:

మంచి నీళ్లు ఆరోగ్యానికి, ధనానికి మంచిది. మంచి నీళ్లుని వృధా చేయడం వల్ల అనారోగ్యం, ధననష్టం కలుగుతుంది అని పండితులు చెప్తున్నారు. వాస్తు ప్రకారం పక్షులకి నీళ్లు పెట్టడం వల్ల ఇంట్లో పాజిటివిటీ ఉంటుందని అదే విధంగా నీటిని వృధా చేయకుండా సేవ్ చేయడం వల్ల మంచి జరుగుతుందని అన్నారు.

కర్పూరం వెలిగించడం:

వారం లో కనీసం ఒక్క సారి అయినా ఇంట్లో కర్పూరాన్ని వెలిగించడం వల్ల నెగటివ్ ఎనర్జీ పోతుందని.. పాజిటివిటీ ఉంటుందని పండితులు చెప్పారు.

పండ్లని ఉంచడం:

ఒక బుట్ట నిండా పండ్లు ఉంచి వాటిని పేర్చి టేబుల్ మీద ఉంచడం వల్ల పాజిటివిటీ ఉంటుందని ఇది మంచి జీవన విధానానికి సూచన అని పండితులు చెప్తున్నారు. కాబట్టి ఈ విధంగా కూడా మీరు అనుసరించడం మంచిది.

Read more RELATED
Recommended to you

Latest news