గుడ్ న్యూస్ : ఎంసెట్ దరఖాస్తు గడువు పెంపు

-

తెలంగాణ‌లో క‌రోనా తీవ్రత ఇంకా కొనసాగుతూనే ఉంది. మొదట్లో కంటే రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గు ముఖం పట్టినప్పటికీ..కేసీఆర్ ప్ర‌భుత్వం రాష్ట్రంలో లాక్‌డౌన్‌ను మరోసారి పొడిగించింది. ఇక క‌రోనా తీవ్ర‌త నేప‌థ్యంలో ఇప్ప‌టికే టెన్త్‌, ఇంట‌ర్ ప‌రీక్ష‌ల‌ను ర‌ద్దు చేసిన ప్ర‌భుత్వం.. సెట్ ఎగ్జామ్స్‌ను కూడా వాయిదా వేస్తూ వ‌స్తోంది. తాజాగా కెసిఆర్ సర్కార్ ఇప్పుడు మ‌రో నిర్ణ‌యం తీసుకుంది. తాజాగా తెలంగాణ ఎంసెట్ 2021 ద‌ర‌ఖాస్తు గ‌డువును మరో వారం పొడిగించింది ప్ర‌భుత్వం. ఎలాంటి అడిష‌న‌ల్ ఫీజు లేకుండా జూన్ 17వ తేదీ వ‌ర‌కు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాల‌ని సూచించింది.

ఈ విష‌యాన్ని ఓ ప్రకటన ద్వారా విద్యాశాఖ పేర్కొంది. వాస్త‌వానికి ఎంసెట్ గడువు మే 18నే ముగియాల్సి ఉంది. కానీ క‌రోనా కేసులు ఎక్కువ‌గా ఉండ‌టంతో.. దాన్ని జూన్ 10 వ‌ర‌కు పొడిగించింది. ఇప్పుడు లాక్ డైన్ ఉన్న నేప‌థ్యంలో చాలామంది అప్లై చేసుకోలేక‌పోయారు. వారంద‌రినీ దృష్టిలో పెట్టుకుని మ‌రోసారి గ‌డువును జూన్ 17 వరకూ పొడిగించింది ప్ర‌భుత్వం. ఇక ఈ రోజు వరకు 2 లక్షల 20 వేల దరఖాస్తులు వచ్చినట్లు పేర్కొంది ప్రభుత్వం. ఇందులో ఎంసెట్ ఇంజనీరింగ్ కు 1,46,541 దరఖాస్తులు రాగా అగ్రికల్చర్ కు 73486  దరఖాస్తులు వచ్చాయని వెల్లడించారు

Read more RELATED
Recommended to you

Latest news