వాస్తు: ఇలా చేస్తే భార్యాభర్తల మధ్య సమస్యలు వుండవు..!

వాస్తు ప్రకారం ( Vasthu ) పండితులు చెబుతున్న ఈ చిట్కాలను పాటిస్తే ఖచ్చితంగా ఇబ్బందులు ఏమీ లేకుండా ఆనందంగా ఉండొచ్చు. సాధారణంగా చాలా మంది భార్యా భర్తల మధ్య తరచూ గొడవలు అవ్వడం, ఏదైనా ఇబ్బంది కలగడం లాంటివి జరుగుతుంటాయి. అలా కాకుండా ఆనందంగా ఆరోగ్యంగా ఎప్పుడూ కూడా ప్రేమగా ఉండాలంటే వాస్తు పండితులు చెబుతున్న ఈ చిట్కాలను పాటించండి. ఇలా కనుక పాటిస్తే తప్పకుండా భార్య భర్తల మధ్య ఇబ్బందులు దూరం అయిపోతాయి మరి ఆలస్యమెందుకు దీని కోసమే పూర్తిగా చూసేయండి.

Vasthu | వాస్తు

వాస్తు శాస్త్రం ప్రకారం చిలుక పిక్చర్ పెట్టుకుంటే అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయని అంటున్నారు. చిలుక ప్రేమకి, చిరకాలానికి, అదృష్టానికి చిహ్నం. చైనీస్ సివిలైజేషన్ లో కూడా చిలుకని శుభంగా భావిస్తారు. మీ యొక్క రిలేషన్షిప్ బాగుండాలంటే కచ్చితంగా రెండు చిలకల ఉన్న పిక్చర్ ని బెడ్రూం లో అంటించండి.

ఇలా చేయడం వల్ల అదృష్టం కలిసి వస్తుంది అదే విధంగా మీ ఇద్దరి మధ్య బంధం బలపడుతుంది. వ్యాపారం చేసే వాళ్ళకి కూడా చిలుక మంచి లాభాలను తీసుకు వస్తుంది. కాబట్టి వ్యాపారాలు తమ ఇళ్లల్లో ఉత్తరం వైపు చిలుకని పెట్టడం వల్ల వ్యాపారులకు కలిసి వస్తుంది దీంతో వ్యాపారంలో లాభాలు కూడా పొందొచ్చు.