గాంధీ హాస్పిటల్ అత్యాచార ఘటన.. 7గురు అరెస్ట్.. !

గాంధీ హాస్పిటల్ అత్యాచార ఘటనలో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. గాంధీ లో పనిచేస్తున్న ఉమామహేశ్వర తో పాటు మరో ఆరుగురిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అక్కాచెల్లెళ్లకు కళ్ళులో మత్తు మందు ఇచ్చి అత్యాచారం చేసినట్టు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నెల 5న బాధితురాలి భర్త గాంధీ ఆస్పత్రిలో చేరారు. అయితే వారికి ఉమామహేశ్వర్ దూరపు బంధువు కావడంతో అతని సహాయం కోరారు.

దాన్ని ఆసరాగా తీసుకుని ఉమామహేశ్వర్ మత్తు మందు ఇచ్చి పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డారు. ఉమా మహేశ్వర్ తో పాటు అతని స్నేహితులు కూడా ఈ దారుణానికి పాల్పడ్డాడు. బాధిత మహిళలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఉమా మహేశ్వర్ తో పాటు అతడి స్నేహితులను అరెస్ట్ చేశారు. ప్రస్తుతం హైదరాబాద్ లోని చిలకలగూడ పోలీస్ స్టేషన్ లో విచారణ కొనసాగుతోంది. నిందితులను కఠినంగా శిక్షించాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు.