వాస్తు: ఈ తప్పు చేస్తే ఆర్ధిక సమస్యలు వస్తాయి తెలుసా..?

వాస్తును పాటించే ఇళ్లల్లో పాజిటివిటీ ఉంటుంది. తద్వారా నెగిటివిటీ తొలగిపోతుంది. వాస్తు శాస్త్రం ప్రకారం వీటిని మీ ఇంట్లో ఉంచితే మీకు మంచి జరుగుతుంది. అయితే ఈ రోజు మనకి వాస్తు పండితులు కొన్ని విషయాలను చెప్పారు. వాటి కోసం ఎటువంటి ఆలస్యం లేకుండా చూసేయండి. వీటిని కనుక మీరు పాటించారు అంటే ఇబ్బందులు తొలగిపోతాయి. పైగా మీ ఇంట్లో పాజిటివ్ వాతావరణం ఉంటుంది. పూర్తిగా నష్టాలు తొలగిపోతుంది.

వాస్తు పండితులు చెప్పిన దాని ప్రకారం నీటితో ఉండే ఫోటో ఫ్రేమ్స్ లేదా వాల్ స్టిక్కర్స్ లాంటివి ఆగ్నేయం వైపు ఉండకూడదు అని అంటున్నారు. ఒకవేళ కనుక ఆగ్నేయం వైపు మీరు కనుక వాటిని పెడితే నీకు నష్టం కలుగుతుందని అంటున్నారు. ఆగ్నేయం అనేది డబ్బులు తిరిగి వస్తాయి అనే దానికి సంకేతం. అటువంటిది మీరు ఆగ్నేయం వైపు కనుక నీటిని ఉంచారు అంటే డబ్బులు మంచి నీళ్లలా ఖర్చు అయిపోతాయి.

చాలా సార్లు ఎవరో ఒకరు చెప్తూ ఉంటారు.. చాలా కష్టపడుతున్నాం కానీ డబ్బులు వచ్చినట్లే లేదు వాళ్ళు ఈ తప్పు చేశారేమో గమనించుకోవడం మంచిది. నీటికి సంబంధించిన వాటిని ఆగ్నేయం వైపు కనుక ఉంచితే వాటిని మార్చుకోవడం మంచిది. అదే విధంగా అద్దాన్ని కూడా ఆ దిక్కున ఉంచడం మంచిది కాదు.

దీని వల్ల నెగిటివ్ ప్రభావం పడుతుంది. కాబట్టి మీ ఇంట్లో ఆగ్నేయం దిక్కు లో ఇటువంటి నీటికి సంబంధించిన వాటిని వుంచద్దు. అదే విధంగా ఆఫీసులో కూడా ఈ విషయం వర్తిస్తుంది. కావాలంటే మీరు తలుపులు మీద వీటిని ఉంచచ్చు. తలుపుల మీద పెట్టినప్పుడు కూడా ఆగ్నేయం వైపు లేకుండా చూసుకోండి.

ఇది మీకు చాలా బాగా సహాయ పడుతుంది ఈ విషయాలన్నీ మీరు ఇల్లు సర్దేటప్పుడు గమనించడం మంచిది. ఇలాంటి చిన్న చిన్న మార్పులు చేస్తే నెగటివ్ ఎనర్జీని తొలగిపోయి.. మీ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. దీనితో మీకు ఆర్థిక నష్టాలు కూడా రావు. కనుక వీటిని పరిగణనలోకి తీసుకోవడం మంచిది.